ప్రధాని మోదీ తో చర్చించిన అంశాలివే : ఏషియానెట్ ఇంటర్వ్యూలో వరల్డ్ అథ్లెట్ ఛాంపియన్ ఆసక్తికర కామెంట్స్
వరల్డ్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కోతో ఏషియా నెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజేష్ కల్రా ప్రత్యేక ఇంటర్వ్యూ.
world athletics head sebastian coe exclusive interview :: ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల సమావేశమయ్యారు. భారత్ లో అథ్లెటిక్స్ అభివృద్ది, 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో చర్చించిన అంశాల గురించి సెబాస్టియన్ కో ఏషియానెట్ తో పంచుకున్నారు. దేశంలో క్రీడారంగం పోషిస్తున్న పాత్ర గురించి ప్రధానంగా చర్చించినట్లు సెబాస్టియన్ తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే తాను ప్రధానిని కలిశానని సెబాస్టియన్ కో తెలిపారు. ప్రధాని ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ తనకు కొంత సమయం కేటాయించారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు వున్నాయంటే సామాన్య ఎంపీలు, మంత్రులే ఎంత బిజీగా వుంటారో మనందరికీ తెలుసు... అలాంటిది ప్రధాని ఇంకేంత బిజీగా వుంటారు... ఇలాంటి బిజీ షెడ్యూల్ లోనూ నరేంద్ర మోదీ తనకు సమయం కేటాయించడం గొప్ప విషయమని సెబాస్టియన్ అన్నారు.
ప్రధాని బిజీ షెడ్యూల్ లోనూ చర్చలు మంచి పద్ధతిలో జరిగాయన్నారు. ఇప్పటివరకు ఎందరో ప్రపంచ నేతలను కలిసాను... కానీ సమాజంలో క్రీడల ప్రాముఖ్యత గురించి ఒక నాయకుడితో ఇంత మంచి చర్చ జరగలేదని సెబాస్టియన్ కో తెలిపారు. దేశ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో క్రీడలు పోషించే పాత్ర గురించి నరేంద్ర మోదీ తరచుగా మాట్లాడుతున్నారని సెబాస్టియన్ గుర్తుచేసారు. ఒక ప్రధాని ఇలా ఆలోచించడం దేశానికి ఎంతో మేలు చేస్తుందని... ఓ రాజకీయ నాయకుడు ఇంత కాలంంగా క్రీడల గురించి మాట్లాడటం వింటుంటే బాగుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవ్యతో కు సెబాస్టియన్ సమావేశమయ్యారు.
సెబాస్టియన్ కో 1980-84 నుండి రెండుసార్లు ఒలింపిక్ 1,500 మీ ఛాంపియన్. 68 ఏళ్ల సెబాస్టియన్ కో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. భారత్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తహతహలాడుతున్న వేళ సెబాస్టియన్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
పూర్తి ఇంటర్వ్యూ