World Athletics Championships 2023: గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న నీర‌జ్ చోప్రా

World Athletics Championships 2023: స్టార్ ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. అతను మొదటి త్రోలో ఫౌల్ చేసినప్పటికీ తన రెండవ ప్రయత్నంలో వచ్చిన 88.17 మీటర్ల తన అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. 
 

World Athletics Championships 2023: Neeraj Chopra wins gold medal RMA

Neeraj Chopra wins gold: స్టార్ ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. అతను మొదటి త్రోలో ఫౌల్ చేసినప్పటికీ తన రెండవ ప్రయత్నంలో వచ్చిన 88.17 మీటర్ల తన అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. 

పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 

నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర.. 

దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ ను ఏకకాలంలో సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా చోప్రా నిలిచాడు. బింద్రా 23 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్, 25 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ స్వర్ణం గెలిచాడు.  2021 టోక్యో ఒలింపిక్స్ లో  తొలి భారత ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచిన చోప్రా 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్  లో రజత పతకం సాధించాడు. అతని కంటే ముందు లెజెండరీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ 2003 ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన ప్రఖ్యాత జాన్ జెలెజ్నీ, నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్సెన్ తర్వాత ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌  టైటిళ్లను ఏకకాలంలో గెలుచుకున్న మూడో జావెలిన్ త్రోయర్ గా భారత సూపర్ స్టార్ నిలిచాడు.

ఇదిలావుండ‌గా, కిశోర్ జెనా (84.77 మీటర్లు), డీపీ మను (84.14 మీటర్లు) వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారతీయులు టాప్-8లో నిలిచారు. ఇక, పురుషుల 4×400 మీటర్ల రిలే రేసులో మహ్మద్ అనాస్ యాహియా, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్ వరియాతోడి, రాజేష్ రమేష్ లతో కూడిన బృందం 5వ స్థానంలో నిలిచింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఫైనల్లో పరుల్ చౌదరి 9 నిమిషాల 15.32 సెకన్ల జాతీయ రికార్డుతో 12వ స్థానంలో నిలిచింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios