మూడు టీ20 మ్యాచ్‌లలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య తొలి టీ20 ఇవాళ వెల్లింగ్టన్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కివీస్ బ్యాట్స్‌మెన్లలో సోఫీ డివైన్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను గెలిచిన భారత జట్టు.. టీ20 సిరీస్‌ను కూడా గెలిచి సత్తా చాటాలని భావిస్తుండగా.. పొట్టి క్రికెట్‌ను సొంతం చేసుకుని పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.