Wimbledon 2023: ప్రతిష్ఠాత్మక  వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. తుది పోరులో నోవాక్ జొకోవిచ్‌ని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు

Wimbledon 2023: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. ఫైనల్ లో పోరులో సెర్బియా దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 1-6, 7-6, 6-1, 3-6, 6-4 స్కోరుతో నోవాక్ జకోవిచ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు కార్లోస్ అల్కరాజ్ . స్పానిష్ స్టార్ అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ , తొలి వింబుల్డన్ (వింబుల్డన్ 2023) టైటిల్. అల్కరాజ్ 2022లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతకుముందు.. 2021 వింబుల్డన్‌లో టైటిల్ మ్యాచ్‌లో అతను రన్నరప్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. 2022లో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఫైనల్‌లో ఇరువురు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలి సెట్‌ను 6-1తో నొవాక్ జకోవిచ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత అల్కరాజ్ రెండో సెట్‌ను 7-6తో గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో అల్కరాజ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి 6-1తో విజయం సాధించాడు. జకోవిచ్‌ నాలుగో సెట్‌లో వెనుదిరిగి 6-3తో గెలిచాడు. 5వ సెట్‌ను 6-4తో కైవసం చేసుకుని అల్కరాజ్ విజయ పతాకాన్ని ఎగురవేశాడు.

రాఫెల్ నాదల్ రికార్డు బ్రేక్

వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌ను గెలుచుకున్న మూడో స్పానిష్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచారు. ఇంతకు ముందు.. రాఫెల్ నాదల్ 2008, 2010లలో టైటిల్ గెలుచుకున్నాడు. 1966లో మాన్యుయెల్ సంటానా టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా.. ఈ ఘన విజయంతో పురుషుల వింబుల్డన్ టైటిల్ గెలిచిన మూడో పిన్నవయస్కుడిగా అల్కరాజ్ చరిత్ర సృష్టించారు.