రవిశాస్త్రి ఫస్ట్ లవ్ : రవి-అమృతాసింగ్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది..కారణం ఎవరు..?

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 4, Sep 2018, 12:20 PM IST
why ravi shastri not marrying amrita singh
Highlights

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌లు డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రవిశాస్త్రి గత చరిత్ర తిరిగి వార్తల్లో నిలుస్తోంది

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌లు డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రవిశాస్త్రి గత చరిత్ర తిరిగి వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నటి అమృతాసింగ్‌తో డేటింగ్, బ్రేకప్ విషయాల గురించి నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.

1980లలో టీమిండియా కీలక ఆటగాడిగా రవికి దేశంలో మంచి పాపులారిటీ ఉండేది. ఆ సమయంలో బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో కలిసి వివిధ బ్రాండ్ల ప్రకటనల్లో నటించేవారు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. డేటింగ్ చేస్తున్నారని అప్పట్లో భారతీయ మీడియా కోడై కూసింది. అయితే అమృతా సింగ్‌తో కలిసి.. రవిశాస్త్రి ఓ మ్యాగజైన్ కవర్ ఫోటోకు ఫోజివ్వడంతో దేశానికి వీరి ప్రేమ గురించి తెలిసింది.

1986లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఈ జంట పెళ్లీ పీటలదాకా వెళ్లలేకపోయింది. ఇందుకు కారణాలు ఏంటో ఎవరికి తెలియదు. అయితే ఒక సందర్భంలో ‘‘ నేను ఆవేశపరుడిని.. ఓ నటిని నేను భార్యగా కోరుకోలేను... నా సతీమణికి తన ఇళ్లే తొలి ప్రాధాన్యంగా ఉండాలి’’ అని రవి వ్యాఖ్యానించాడు.

ఇదే సమయంలో ‘‘ ప్రస్తుతం నా కెరీర్‌లో బిజీగా ఉంటున్నాను.. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ మంచి భార్యగా.. తల్లిగా మారుతానని’’ తెలిపారు. 1990లో రవిశాస్త్రి రీతూసింగ్‌ను పెళ్లిచేసుకోగా.. 1991లో అమృతాసింగ్‌ను సైఫ్ అలీఖాన్ వివాహం చేసుకున్నారు.
 

loader