హ‌ఠాత్తుగా అత్త‌గారు వ‌చ్చేస్తే..: సెహ్వాగ్‌ (వీడియో)

what happens When your mother-in law suddenly appears
Highlights

హ‌ఠాత్తుగా అత్త‌గారు వ‌చ్చేస్తే

మైదానంలో భారీ షాట్ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచిన వీరేంద్ర సెహ్వాగ్‌.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ద్వారా ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. వివిధ ర‌కాల అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే సెహ్వాగ్ అప్పుడప్పుడు ఫ‌న్నీ జోక్స్‌, వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటాడు. తాజాగా సెహ్వాగ్ షేర్ చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
 
`మీ అత్త‌గారు అనుకోకుండా వ‌చ్చేస్తే..` అంటూ ఆ కామెంట్‌కు సెహ్వాగ్ జ‌త చేసిన వీడియో న‌వ్వులు పూయిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్య‌క్తి త‌న భార్య కాళ్ల‌ను చిన్న ప్లాస్టిక్ ట‌బ్‌లో పెట్టి కుడుగుతుంటాడు. అదే స‌మ‌యంలో అత‌ని త‌ల్లి అనుకోకుండా అక్క‌డ‌కు వ‌స్తుంది. దీంతో భార్య‌భ‌ర్త‌లు త‌మ పొజిష‌న్ల‌ను మార్చేసుకుంటారు. భ‌ర్త త‌ల‌ను భార్య కడుగుతున్న‌ట్టుగా పొజిష‌న్లు మార్చుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

loader