ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని చీటింగ్ కామెంట్స్ వదలడం లేదు. ప్రస్తుతం యూషెస్ సిరీస్ లో చెలరేగిపోతున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లను కించపరిచే విధంగా కొందరు ప్రవర్తించారు. చీటర్స్, చీటర్స్ అంటూ స్టేడియంలో మోత మోగించారు. కాగా... ఆ కామెంట్స్ కి వార్నర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో వార్నర్, స్మిత్ లు బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరు సంవత్సరం పాటు శిక్ష కూడా అనుభవించారు. అయినా... వారిని  చీటర్, చీటర్ అంటూ వేధించడం మాత్రం ఆగడం లేదు.

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆసీస్‌ జట్టు తన డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి గ్రౌండ్‌లోకి వెళుతున్న సమయంలో ఇంగ్లిష్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌  వార్నర్‌పై మరోసారి నోరే పారేసుకున్నారు. ‘హేయ్‌ డేవిడ్‌ వార్నర్‌.. నువ్వొక చీటర్‌’ అంటూ ఇంగ్లండ్‌ అభిమానులు ఎగతాళి చేసే యత్నం చేశారు. దీనికి వెంటనే వెనక్కి తిరిగి చూసిన వార్నర్‌..  తన రెండు చేతుల్ని పైకి ఎత్తి వావ్‌ అంటూ నవ్వుతూ రిప్లూ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంకెవరైనా అయితే కోపం తెచ్చుకోవడమో, అవమానంగా ఫీలవ్వడం లాంటివి చేసేవారేమో... కానీ వార్నర్ మాత్రం చాల సరదాగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.