Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలంపిక్స్.. కండోమ్ తో పతకం గెలిచిన అథ్లెట్..!

ఆ కండోమ్ ఉపయోగించుకొని.. ఓ క్రీడాకారిణి పతకం గెలిచింది. నమ్మకసక్యంగా లేకపోయినా ఇది నిజం. కండోమ్ లేకపోయి ఉంటే.. ఆమె ఓడిపోయేది. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. కండోమ్ ని వినియోగించింది. ఫలితంగా విజయం సాధించింది.

Watch Athlete Uses Condom To Repair Kayak, Goes On To Win Gold At Olympics
Author
Hyderabad, First Published Jul 30, 2021, 12:49 PM IST

టోక్యో ఒలంపిక్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. క్రీడాకారులంతా పతకం గెలవడం కోసం తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. కాగా.. ఈ ఒలంపిక్స్ లో అధికారులు అథ్లెట్స్ కి కండోమ్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే . అయితే.. వాటిని సెక్స్ కోసం వినియోగించవద్దని.. కావాలంటే మీ దేశం తీసుకువెళ్లండి అంటూ.. అధికారులు క్రీడాకారులకు చెప్పారు.

 కాగా.. ఆ కండోమ్ ఉపయోగించుకొని.. ఓ క్రీడాకారిణి పతకం గెలిచింది. నమ్మకసక్యంగా లేకపోయినా ఇది నిజం. కండోమ్ లేకపోయి ఉంటే.. ఆమె ఓడిపోయేది. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. కండోమ్ ని వినియోగించింది. ఫలితంగా విజయం సాధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియాకు చెందిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(27) కండోమ్ వాడి బ్రాంజ్(కాంస్యం) మెడల్ గెలిచింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.

 

జెస్సికా ఫాక్స్ తను ఎదుర్కొన్న సమస్యకు కండోమ్ సాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని తన కోచ్ పిండి పదార్ధం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. అలా పడవకు రిపేర్ చేసి రేస్ ముగించింది. ఈ సీక్రెట్ ను తాజాగా ఆమే సోషల్ మీడియాలో రివీల్ చేసింది. ఆమె సమయస్ఫూర్తి చూసి.. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios