Asianet News TeluguAsianet News Telugu

షాకయ్యా: గుంగూలీపై వివిఎస్ లక్ష్మణ్, వీరి సినిమాలు చూస్తా!

లార్డ్స్ మైదానంలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పేయడంపై హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ స్పందించారు. లార్డ్స్‌లో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పేసి తిప్పినప్పుడు తొలుత షాకయ్యానని అన్నాడు.

VVS Laxman comments on Sourav Ganguly
Author
Hyderabad, First Published Aug 10, 2018, 10:41 PM IST

హైదరాబాద్: లార్డ్స్ మైదానంలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పేయడంపై హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ స్పందించారు. లార్డ్స్‌లో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పేసి తిప్పినప్పుడు తొలుత షాకయ్యానని అన్నాడు. ట్వీట్టర్ లో ఆయన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీనే గొప్పవాడని లక్ష్మణ్ అన్నాడు. కోహ్లీ చేయాలనుకున్న పనిని సమర్థంగా అమలు చేస్తాడని అన్నాడు. చక్కగా మాట్లాడతాడని, భావోద్వేగాలను నియంత్రించుకుంటాడని కూడా ప్రశంసించాడు. 
తెలుగు సినీ రంగంలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటులున్నారని, తాను మాత్రం మహేశ్ బాబు, నాని సినిమాలను మాత్రం చూస్తుంటానని చెప్పాడు
 
తాను టెస్టుల్లో తొలిసారి ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ చేశానని చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై చేసిన 281 పరుగులు తనకు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పాడు. 

ప్యారడైజ్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పాడు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరనే ప్రశ్నకు వసీం అక్రం అని చెప్పాడు. 

టీ20ల్లో ఏబీ డివిలియర్స్, వన్డేల్లో విరాట్ కోహ్లీ, టెస్టుల్లో స్మిత్ గొప్ప ఆటగాళ్లు అని, మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios