టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నారు.  పరుగుల రారాజుగా పేరున్న కోహ్లీ... వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో సెంచరీ కొట్టేశాడు. ఇప్పటికే తన పరుగులతో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కోహ్లీ... తాజాగా మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. 26ఏళ్ల రికార్డుని కోహ్లీ... నిన్నటి మ్యాచ్ లో బ్రేక్ చేయడం గమనార్హం.

వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.  26 సంవత్సరాలుగా పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్(1930 పరుగులు) పేరున ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో వ్యక్తిగత స్కోర్ 19వద్ద కోహ్లీ.. జావేద్ మియాందాదా రికార్డుని బ్రేక్ చఏశాడు. కోహ్లీ 34 మ్యాచుల్లోనే 71 సగటుతో ఈ ఘనత సాధించాడు.

ఇప్పటి వరకు విండీస్ పై అత్యధికంగా కోహ్లీ 8 సెంచరీలు, 10 అర్థ సెంచరీలు సాధించాడు. కోహ్లీ తొలి వన్డే, తొలి సెంచరీ కూడా విండీస్ పైనే చేయడం విశేషం. కోహ్లీ దెబ్బకు మియాందాద్( 64 మ్యాచుల్లో 1930 పరుగులు) రెండో స్థానంలో పడిపోయాడు. మార్క్ వా( ఆస్ట్రేలియా) 45 ఇన్నింగ్స్ లో 1708 పరుగులు, జాక్వెస్ కలీస్( దక్షిణాఫ్రికా) 40 ఇన్నింగ్స్ లో 1666, రమీజ్ రాజా( పాకిస్తాన్) 53 ఇన్నింగ్స్ లో 1624 పరగులు చేసి తర్వాతి స్థానాల్లో నిలిచారు.