Asianet News TeluguAsianet News Telugu

"కింగ్ రోజర్".. టెన్నిస్ రారాజుకు క్రికెట్ ప్రపంచం సెల్యూట్.. కోహ్లీ ఎలా రియాక్ట్ అయ్యారంటే.. ? 

Roger Federer Retirement News: టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్ ఇంటర్నేషనల్ టెన్నిస్‌కి రిటైర్మెంట్ ప్రకటించి టెన్నిస్ ప్రియులకు షాకిచ్చాడు. లండ‌న్ లో జ‌రిగే లావర్ కప్ తర్వాత మళ్లీ ఇంటర్నేషనల్ టెన్నిస్ కోర్టులో రోజర్ ఫెదరర్ లైవ్ పర్‌ఫార్మెన్స్ చూడలేమనే ఆలోచన ఫెదరర్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురిచేసింది.  రోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన క్రికెట్ ప్రపంచం.  

Virat Kohli react on Federer as Tennis Legend Announces Retirement
Author
First Published Sep 15, 2022, 11:29 PM IST

Roger Federer: టెన్నిస్ దిగ్గ‌జం రోజర్ ఫెదరర్ గురువారం ఇంటర్నేషనల్ టెన్నిస్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయ‌న అకస్మాత్తుగా గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించి.. టెన్నిస్ ప్రియులకు షాకిచ్చాడు. తన కెరీర్‌కు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఈ లేఖలో స్పష్టంగా చెప్పారు. వచ్చే వారం లండన్‌లో జరగనున్న లావర్ కప్ తన కెరీర్‌లో ఆఖరి టోర్నమెంట్ కానుందని రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు.

ఇక త‌న అభిమాన ఆట‌గాడిని టెన్నిస్ కోర్టులో చూడ‌లేమ‌న్న ఆలోచన అత‌ని అభిమానుల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది.  41 ఏళ్ల  ఫెద‌ర‌ర్ త‌న కెరీర్‌లో  20 గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అత్యధిక  రికార్డులు సొంతం చేసుకున్న ఏకైక ఆటగాడిగా రోజర్ ఫెదరర్ ఘ‌న‌త సాధించారు. 

రోజర్ ఫెదరర్ ఇంత సడెన్‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని ఎవరూ ఊహించలేదు. అత‌ని రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌నపై కేవ‌లం అభిమానులే కాదు.. క్రికెట్ ప్రపంచంలోని దిగ్గజాలు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. త‌మదైన శైలిలో క్రీడా ప్రపంచంలోని ఈ దిగ్గ‌జ టెన్నిస్ ఆట‌గాడికి అభినందనలు తెలిపారు. 

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పటికప్పుడు తనను తాను ఫెదరర్ అభిమానిగా పిలుచుకుంటూ వింబుల్డన్‌లో మ్యాచ్‌లు చూస్తూ కూడా చాలాసార్లు కనిపించాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఫెదరర్ చేసిన పోస్ట్‌ను గుర్తించిన కోహ్లీ.. టెన్నిస్ ఐకాన్ ఫెద‌ర‌ర్..   ఆల్ టైమ్ గ్రేట్.. కింగ్ రోజర్,” అని కామెంట్ చేశారు. 

అలాగే.. కోహ్లి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా దిగ్గజ స్విస్ స్టార్‌ను కలిశారు. ఆనాటి ఫోటోను షేర్ చేశారు. ఆనాడు ఫెడరర్ ను క‌లిసి తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. చాలా ఎగ్సైట్ అయ్యారు. త‌న‌కు ఫ్యాన్‌బాయ్  మూమెంట్ లా ఉందని పేర్కొన్నారు. ఫెద‌ర‌ర్ ను గ‌తంలో రెండు సార్లు కలిశాననీ, అతను త‌న‌ని గుర్తుకు పెట్టుకోవ‌డం నిజంగా అద్భుత‌మ‌ని కోహ్లీ తెలిపారు. త‌న చిన్న‌త‌నం నుంచి ఫెద‌ర‌ర్ ఆడటం చూశాననీ,  గొప్ప టెన్నిస్ ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప మానవుడు కూడా అని కోహ్లీ పేర్కోన్నారు. 
 
రోజర్ ఫెదరర్‌ను చాలాసార్లు కలుసుకుని అతని మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఫెదరర్‌కు అభినందనలు తెలిపారు. యాదృచ్ఛికంగా.. ఇద్దరు లెజెండ్‌ల వృత్తిపరమైన క్రీడా జీవితం 24 సంవత్సరాల పాటు కొనసాగింది. సచిన్ తన ట్వీట్‌లో.. అద్భుతమైన కెరీర్ రోజర్ ఫెదరర్. మేము మీ టెన్నిస్ బ్రాండ్‌ను ఇష్టపడ్డాము. నెమ్మదిగా మీ టెన్నిస్ అలవాటు అవుతుంది. అలవాట్లు ఎప్పుడూ విరమించుకోలేవు, అవి మనలో భాగమవుతాయి. గొప్ప జ్ఞాపకాలు." అందుకు ధన్యవాదాలు. అని పేర్కొన్నారు.  

ఇది కాకుండా, టీమ్ ఇండియా వెటరన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫెద‌ర‌ర్ ప్ర‌క‌ట‌న పై స్పందించారు. "అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు" అని రాశాడు. అదే సమయంలో, వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా తనదైన శైలిలో ఫెదరర్‌కు సెల్యూట్ చేశాడు. వీరే కాకుండా..ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఐపీఎల్ టీమ్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా ఫెదరర్‌కు సెల్యూట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios