నాటింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని దాటేశాడు. కోహ్లీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఈ 97 పరుగుల వద్ద అవుటై సెంచరీని చేజార్చుకున్న విషయం తెలిసిందే. 

 విదేశీగడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా గంగూలీ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సౌరవ్ గంగూలీ పేరు మీద ఉండేది. గంగూలీ విదేశాల్లో జరిగిన 28 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే ఆయన 1,693 పరుగులు చేశారు.
 
కెప్టెన్ గా కోహ్లీ 19 టెస్టుల్లో 1,731 పరుగులు చేసి గంగూలీని దాటేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 30 టెస్టుల్లో టీం ఇండియాకు కెప్టెన్‌గా విదేశాల్లో 1,591 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాదుకు చెందిన మొహమ్మద్ అజారుద్దీన్ 27 టెస్టుల్లో ఇండియాకు కెప్టెన్‌గా విదేశాల్లో 1,517 పరుగులు చేశాడు. 

ఈ జాబితాలో ఐదో స్థానంలో రాహుల్ ద్రవిడ్ నిలిచారు. 17 విదేశీ టెస్ట్‌లో టీం ఇండియాకు కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్ మొత్తం 1,219 పరుగులు చేశారు.
 
దాంతో పాటు కోహ్లీ ఇంగ్లండ్‌పై 1000 పరుగులు చేసిన 13వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇంగ్లండ్‌పై ఆయన 51.73 సగటు, ఏడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 2,535 పరుగులు చేశారు.