బాలీవుడ్ నటి  అనుష్క శర్మ, షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జీరో’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ సినిమాలో తన భార్య నటన అద్భుతంగా ఉందని ట్వీట్ చేసి.. విరాట్ కోహ్లీ మరోసారి ట్రోలింగ్ బారినపడ్డాడు.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రోజుల క్రితం చిత్రాన్ని చూసి ట్విట‌ర్‌లో త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. జీరో సినిమా చూసి ఎంజాయ్ చేశాను. చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంసించారు. ముఖ్యంగా త‌న భార్య అనుష్క శ‌ర్మ ఎంచుకున్న పాత్ర‌లో న‌టించ‌డం చాలా క‌ష్ట‌మ‌న‌వి.. అమె గొప్ప‌గా న‌టించింద‌ని కొనియాడాడు. 

దీనిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాకు అత్యంత చెత్త రివ్యూ ఇచ్చావ‌ని.. సినిమాల‌కు రివ్యూలు ఇచ్చే బ‌దులు క్రికెట్‌పై దృష్టి పెట్ట‌డ‌మే మంచిద‌ని విరాట్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు. మరి కొందరేమో.. ఇంత చెత్త సినిమా చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.