సెంచరీ సంబరాలను కోహ్లీ మళ్లీ అలాగే జరుపుకున్నాడు

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 21, Aug 2018, 4:51 PM IST
Virat Kohli Does It Again, Blows Kiss To Wife Anushka Sharma After Hitting third Test Century
Highlights

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో టీం ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మూడో టెస్ట్ మాత్రం పుంజుకున్న భారత జట్టు సీరీస్లో మొదటిసారిగా విజయం దిశగా పయనిస్తోంది. అయితే ఈ విజయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అద్భుత సెంచరీ చాలా ఉపయోగపడింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం విరాట్ సెంచరీ కంటే ఆ తర్వాత అతడు చేసుకున్న సంబరాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ సంబరాలకు అంత ప్రత్యేకత ఉంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ...ఈ జోడీ ఇటు క్రికెట్ అభిమానులకు అటు బాలీవుడ్ అభిమానులకు అత్యంత ఇష్టమైన జంట. వీరి సంబంధించిన ఏ విషయంపై అయినా  అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు.

అయితే తాజాగా నాటింగ్ హామ్ లో జరుగుతున్న మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో విరాట్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ కెరీర్ లో ఇది 23వ టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీ భారత్ భారీ స్కోరు చేయడానికి దోహదపడింది. 

అయితే ఈ సెంచరీ తర్వాత విరాట్ తనదైన స్టైల్ లో సంబరాలు జరుపుకున్నారు. తన బ్యాట్ కు ముద్దుకు పెట్టుకుని గ్యాలరీలోని భార్య అనుష్క వైపు ఆ బ్యాట్ ను చూపాడు. దీంతో అనుష్క కూడా తెగ సంబరపడిపోయింది. అయితే కోహ్లీ గతంలో కూడా ఇలా తన భార్యకు గాల్లో ముద్దులు ఇస్తూ సంబరాలు జరుపుకున్నారు. తాజాగా మరోసారి అలాగే సెంచరీ సంబరాలు జరుపుకోవడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. అంటే తమ అభిమాన ఆటగాడు ఎన్ని సార్లు ఇలా చేసినా మాకు కొత్తగానే  ఉంటుందంటున్నారు అభిమానులు. 

loader