Asianet News TeluguAsianet News Telugu

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

విరాట్ కోహ్లీ...టీంఇండియా కెప్టెన్ గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న ఆటగాడు. అతడు బ్యాట్ నుండి పరుగుల వరద పారుతుంటే ఇండియన్ క్రికెట్ దిగ్గజాల రికార్డులు ఒక్కోటిగా బద్దలవుతూ వస్తున్నాయి. తాజాగా అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగున్న టెస్ట్ కోహ్లీ మరో భారత దిగ్గజం అరుదైన రికార్డును బద్దలుగొట్టాడు.

virat kohli another record on adelaide test
Author
Adelaide SA, First Published Dec 8, 2018, 5:58 PM IST

విరాట్ కోహ్లీ...టీంఇండియా కెప్టెన్ గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న ఆటగాడు. అతడు బ్యాట్ నుండి పరుగుల వరద పారుతుంటే ఇండియన్ క్రికెట్ దిగ్గజాల రికార్డులు ఒక్కోటిగా బద్దలవుతూ వస్తున్నాయి. తాజాగా అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగున్న టెస్ట్ కోహ్లీ మరో భారత దిగ్గజం అరుదైన రికార్డును బద్దలుగొట్టాడు.

మొదటి టెస్ట్ రెండో  ఇన్నింగ్స్ లో భాగంగా  బ్యాటింగ్ దిగిన కోహ్లీ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అతడి వ్యక్తిగత స్కోరు 8 పరుగుల వద్ద ఆస్ట్రేలియాలో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదికూడా అత్యంత తక్కువ ఇన్నింగ్సుల్లో. 

ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో వెయ్యి పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్లు ఐదుగురు. వారిలో వివిఎస్. లక్ష్మణ్ అతి తక్కువ ఇన్నింగ్సుల్లో(19) ఈ మార్కును చేరుకున్నాడు. అయితే తాజాగా కోహ్లీ కేవలం 18 ఇన్నింగ్సుల్లోనే ఆ ఫీట్ సాధించి అత్యంత వేగంగా  వేయి పరుగులు సాధించిన ఇండియన్ బ్యాట్ మెన్ గా నిలిచాడు. 

ఇక మిగతా ఆటగాళ్ళ విషయానికి వస్తే సచిన్,  సెహ్వాగ్ లు 22 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా, ద్రవిడ్ 25 ఇన్నింగ్సుల్లో సాధించాడు. మొత్తానికి కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios