టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆయన న్యూలుక్ లో ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు  ధోనీ తనంతతానే దూరంగా ఉన్నారు.  ఆసమయంలో దేశ సరిహద్దులో సైనిక విధులు నిర్వర్తించారు. ఇటీవలే ఆయన ఆ విధులను పూర్తి చేసుకున్నారు.

కాగా తాజాగా ధోనీ  కొత్త లుక్‌లో జైపూర్‌ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఓ వేడుకకు హాజరై వస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో పాటు అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. తలకు నల్లటి బంధన్‌ కట్టుకుని కనిపించారు. ఇలా కూడా ధోనీ స్టైలిష్ గానే కనపడుతున్నారు.

 విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమానులు అతడిని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు వారందరినీ పక్కకు పంపుతూ ధోనికి దారిచ్చారు. మునుపెన్నడూ చూడని గెటప్‌లో కనిపిస్తున్న ధోనీ ఫొటోలు, వీడియోలు  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.