యూఎస్ ఓపెన్ 2019 టైటిల్ సాధించాలన్న రోజర్ ఫెదరర్ ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయి. క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో బల్గేరియన్ గ్రిగర్ డిమిట్రోప్ చేతిలో 6-3, 4-6, 6-3, 4-6, 2-6 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

తొలిసెట్ లో పై చేయి సాధించిన ఫెదరర్ రెండో సెట్ లో ప్రత్యర్థి దాటిని తట్టుకోలేకపోయాడు. తిరిగి పుంజుకొని మూడో సెట్ లో గెలిచినా.. నాలుగో సెట్ లో 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. నిర్ణయాత్మక పోరులో ఫెదరర్ ను గ్రిగర్ మట్టికరిపించాడు. దీంతో 46వ గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్ ను ఫెదరర్ చేరుకోలేకపోయారు. కాగా.. శుక్రవారం జరగనున్న సెమీస్ లో రష్యా ఆటగాడు డేనియల్ తో గ్రిగర్ తలపడనున్నాడు.