యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, నల్లకలువ సెరెనా విలియమ్స్ టైటిల్ వేటలో ఓటమి పాలయ్యారు. ఆదివారం కెనడా యువతి బియాంక అండ్రిస్కూతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 7-5 తేడాతో సెరెనా ఓటమి పాలైంది.

ఈ విజయంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ గెలిచిన తొలి కెనడియన్‌గా బియాంక రికార్డుల్లోకి ఎక్కింది. 19 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ గెలిచిన బియాంక.. మరియా షరపోవా తర్వాతి స్థానంలో నిలిచింది.

మరోవైపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్స్‌లో వరుసగా నాలుగోసారి ఓడిపోయి.. 24వ సారి గ్రాండ్‌స్లామ్ గెలవలన్న కలను సెరెనా మిస్ చేసుకుంది. సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన 1999లో బియాంక జన్మించడం విశేషం.