టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య... సాక్షిపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు కారణం సాక్షి పెట్టిన ఇన్ స్టాగ్రామ్ ఫోటో. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు తల పై ముద్దుపెడుతూ.. సాక్షి పెట్టిన ఫోటోకి నెటిజన్లు.. తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు మోను కుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 'బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్‌ పచ్చగా లేదనుకుంటా.. 'అంటూ మోను కుమార్‌ తలపై సాక్షి ముద్దు పెట్టింది. మోను కుమార్‌ బట్టతలపై సెటైర్‌ వేస్తూ బీపాజిటివ్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో సరదాగా సాక్షి చేసిన పోస్ట్‌పై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ కొందరు హర్ట్‌ అయ్యారు. మీరు ఇలా పోస్ట్‌ పెట్టడం మమ్మల్ని బాధించింది, మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నామంటూ మెసేజ్‌లు పెట్టారు. 

సాక్షిని అనుసరిస్తూ మరికొందరు.. ఫ్లాట్‌ పిచ్‌ బాగుంది బ్యాటింగ్‌కు పనికొస్తుంది అంటూ బట్టతలపై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకు ముందు సాక్షిసింగ్‌ను ప్రపంచంలోనే ఉత్తమ వదిన అంటూ మోను కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే.