Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: ఎట్టకేలకు భారత మహిళల హాకీ జట్టు తొలి విజయం

భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో భారత్ 1-0 తేడాతో గెలిచింది. 

Tokyo Olympics: Indian women's Hockey Team win against Ireland 1-0
Author
Tokyo, First Published Jul 30, 2021, 10:58 AM IST

భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో భారత్ 1-0 తేడాతో గెలిచింది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో భారత జట్టు విజయం సాధించింది. కెప్టెన్ రాణి రాంపాల్ అద్భుతమైన రివర్స్ హిట్ తో భారత్ కి ఆఖరు క్వార్టర్ లో గోల్ ని అందించి భరత్ కు  విజయాన్ని అందించింది. 

భారత్ మ్యాచులో చాలావరకు బాల ని తమ కంట్రోల్ లో ఉంచుకుని, అత్యధిక సర్కిల్ పెనట్రేషన్లు సాధించినప్పటికీ... భారత్ వాటిని గోల్స్ లా కంట్రోల్ చేయడంలో విఫలమైంది. ఐర్లాండ్ కన్నా దాదాపుగా రెండు రేట్లు అధిక సర్కిల్ పెనట్రేషన్లను భారత్ సాధించినప్పటికీ... వాటిని గోల్స్ లా మలుచుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 

ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఈ మ్యాచు తొలి క్వార్టర్లో భారత్ 5 పెనాల్టీ కార్నర్లను, 9 సార్లు బంతిని ప్రత్యర్థి సర్కిల్ దాకా తీసుకెళ్లింది. కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్ గా మలచడంలో విఫలమైంది. రాణి రాంపాల్ సేనకు ఈ మ్యాచు అత్యంత కీలకం. ఇందులో భారీ విజయం సాధిస్తేనే తదుపరి పోరుకు అర్హత సాధిస్తారు. అటువంటి మ్యాచులో తొలి క్వార్టర్ లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించకుండా 0-0 తో నిలిచారు. 

రెండవ క్వార్టర్ లో అటు ఐర్లాండ్ కి, ఇటు భారత్ కి పెనాల్టీ కార్నర్ల రూపంలో అవకాశాలు దక్కినప్పటికీ... ఇరు జట్లు కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్ కి ఆఖరి 5 నిమిషాలుండగా రెండు అవకాశాలు వచ్చినప్పటికీ... వాటిని గోల్స్ గా మాత్రం మరల్చలేకపోయింది. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి కూడా భారత్, ఐర్లాండ్ లు 0-0 తోనే ఉన్నాయి. 

ఇక మూడవ క్వార్టర్ లో భారత్ ఎగ్రెసివ్ గా ఆది అత్యధిక సార్లు సర్కిల్ పెనట్రేషన్లను సాధించినప్పటికీ... భారత్ మరోసారి వాటిని గోల్స్ రూపంలో మరల్చలేకపోయింది. ఇక పెనాల్టీ కార్నర్లను సైతం వృధా చేసుకుంది భారత్. ఐర్లాండ్ కన్నా దాదాపుగా నాలుగురెట్లు భారత్ కు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కాయి. అయినప్పటికీ... భారత్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. 

ఇక నాలుగవ క్వార్టర్ లో భారత్ కి ఆదిలోనే గ్రీన్ కార్డు చూపించారు రెఫరీ. ఇక ఆఖరు క్వార్టర్లో ఇరు జట్లు కూడా ఒకరి గోల్ పోస్ట్ పై మరొకరు దాడి చేసే ప్రయత్నం చేసారు. భారత గోల్ పోస్టు పై ఐర్లాండ్ దాడి చేసినప్పటికీ... గోల్ కీపర్ సవిత అద్భుతమైన సేవ్ తో భారత్ కి ప్రమాదాన్ని తప్పించింది. 

ఆఖరి నాలుగు నిముషాలు మిగిలి ఉందనగా భారత్ తొలి గోల్ ని సాధించింది. కెప్టెన్ రాణి రాంపాల్ అద్భుతమైన రివర్స్ హిట్ ని నవనీత్ అద్భుతంగా డిఫ్లెక్ట్  చేసి భారత్ కి తొలి గోల్, తమ ఏకైక గోల్ ని సాధించింది. దీనితో భారత్ 1-0 తేడాతో మ్యాచుని కైవసం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios