Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: ఆర్జెంటినా పై 3-1 తో భారత హాకీ జట్టు విజయం,క్వార్టర్స్ లోకి ఎంట్రీ

హాకీ పూల్ ఏ మ్యాచులో నేడు అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచులో భారత జట్టు 3-1 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 

Tokyo Olympics: Indian Hockey Mens Team Wins 3-1 against Argentina
Author
Tokyo, First Published Jul 29, 2021, 7:40 AM IST

హాకీ పూల్ ఏ మ్యాచులో నేడు అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచులో భారత జట్టు 3-1 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. భారత్ ఈ విజయంతో క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. మూడవ క్వార్టర్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్ ని కూడా సాధించలేకపోయినప్పటికీ... మూడవ క్వార్టర్ చివర్లో భారత్ తొలి గోల్ ని సాధించగా... ఆర్జెంటినా నాలుగవ క్వార్టర్ ఆరంభంలో తొలి గోల్ సాధించి స్కోర్ ని ఈక్వలైజ్ చేసింది.

ఇక ఆఖరు 5 నిమిషాల లోపు భారత్ రెండు గోల్స్ ని సాధించి 3-1 తో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. సర్కిల్ పెనట్రేషన్లను భారత్ అధికంగా చేసినప్పటికీ... భారత్ వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ మరోసారి గోల్ పోస్ట్ ను కాచి కాపాడాడు. 

తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు కూడా ఒక్క గోల్ ని కూడా సాధించలేకపోయాయి. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి భారత్,అర్జెంటీనాలు 0-0 తో నిలిచాయి. భారత్ మూడవ క్వార్టర్ ముగుస్తుందంగా ఆఖరి 5 నిముషాలు మిగిలి ఉండగా పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సాధించింది.

వరుణ్ ఒక అద్భుతమైన గోల్ తో భారత్ కు 1-0 లీడ్ ని అందించాడు. థర్డ్ క్వార్టర్ ముగిసే సరికి భారత్ 1-0 తో ఒకింత లీడ్ లో కనిపించినప్పటికీ... హాకీ వంటి ఫాస్ట్ గేమ్స్ లో ఈ లీడ్ సరిపోదని మరోసారి నిరూపిస్తూ ఆర్జెంటినా... నాలుగవ ఆఖరు క్వార్టర్ ఆరంభంలో ఆర్జెంటినా గోల్ సాధించి స్కోర్ ని సమం చేసింది. 

నాలుగవ క్వార్టర్లో 1-1 తో సమానంగా నిలిచినా రెండు జట్లు కూడా తమ లీడ్ ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ... అవతలి గోల్ పోస్ట్ పై వరుస దాడులు చేసారు. భారత్ ఆఖరి మూడు నిముషాలు మిగిలి ఉందనగా... భారత్ అద్భుతమైన గోల్ ని సాధించి తమ లీడ్ ని 2-1 కి పెంచుకుంది. భారత్ ఆటగాడు వివేక్ ప్రసాద్ అద్భుతంగా బాల ని గైడ్ చేసి గోల్ సాధించాడు. 

ఇక ఆ లీడ్ ని కాపాడుకుంటూ భారత్ సర్కిల్ పెనట్రేషన్ మీద దృష్టి సారిస్తూ ఆఖరి రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం ఉండగా అందివచ్చిన పెనాల్టీ కార్నర్ ని అద్భుతంగా వాడుకుంది. అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్ తో హర్మన్ ప్రీత్  భారత్ లీడ్ ను 3-1 కి పెంచాడు. డ్రా సమయంలో అగ్రిగేట్ గోల్స్ అవసరం అవనున్న సందర్భంలో... భారత్ సాధించిన 3 గోల్స్ చాలా ఉపయుక్తకరంగా మారనున్నాయి. 

ఒకింత అందివచ్చిన అవకాశాలను భారత్ చేజార్చుకున్నప్పటికీ... అవతలి జట్టు బలహీనతలను కాష్ చేసుకుంటూ పూర్తి స్థాయి అటాకింగ్ తో వారిని ప్రెజర్ లోకి నెట్టి భారత్ అద్భుతమైన విజయం సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios