Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: భారత్ కు రెండవ పతకం ఖాయం చేసిన లవ్లీనా

భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్ కు టోక్యోలో మరో పతకాన్ని, బాక్సింగ్ లో తొలి పతకాన్ని ఖాయం చేసింది. 

Tokyo Olympics: Indian Boxer Lovlina Borgohain wins second medal for India
Author
Tokyo, First Published Jul 30, 2021, 9:15 AM IST

భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్ కు టోక్యోలో మరో పతకాన్ని, బాక్సింగ్ లో తొలి పతకాన్ని ఖాయం చేసింది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో లవ్లీనా తన లవ్లీ పంచులతో తైపీ బాక్సర్ చెన్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమిస్ లోకి దూసుకెళ్లి భారత్ కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. 

తొలి రౌండ్ నుంచి కూడా ఎక్కడా తడబడకుండా మ్యాచులో పూత్ర్హి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి రెండు రౌండ్లను గెలిచినా లవ్లీనా పై మూఢవ రౌండ్ లో తైపీ బాక్సర్ ఎదురుదాడికి దిగినప్పటికీ.. లవ్లీనా తన ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చి క్వార్టర్స్ లో విజయం సాధించి సెమిస్ లోకి దూసుకెళ్లడం ద్వారా కనీసం కాంస్యాన్ని ఖాయం చేసింది

చెన్ చేతిలో లవ్లీనా ఇంతకుమునుపు మూడు సార్లు ఓటమి చెందింది. అందులో ఒకసారి భారత్ లో జరిగిన ఛాంపియన్షిప్స్ లో కూడాఓటమిని చవిచూసింది. ఈ మ్యాచులో ఆ పాత లెక్కలన్నిటినీ కొట్టి పారేస్తూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. మూడవ రౌండ్లో చెన్ బలమైన పంచులు విసిరినప్పటికీ... లవ్లీనా చాలా తెలివిగా ఆది మ్యాచుని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 

బాక్సింగ్ లాంటి ఈవెంట్లో సెమీఫైనల్ కి చేరితే మెడల్ ఖాయం. బాక్సింగ్, రెజ్లింగ్,జూడో మొదలైన క్రీడల్లో రెండు కాంస్య పతకాలను ఇస్తారు. రెండు సెమీఫైనల్స్ లో తలపడ్డ నలుగురు బాక్సర్లలో ఇద్దరు ఫైనల్స్ కి అర్హత సాధించి గోల్డ్,సిల్వర్ మెడల్స్ ని దక్కించుకుంటారు. ఇక సెమిస్ లో ఓటమి చెందిన ఇద్దరు బాక్సర్ల మధ్య మరో పోరును పెట్టి కాంస్య పతక విజేతను డిసైడ్ చేయరు. ఇద్దరికీ కాంస్యపతకాలను అందిస్తారు. అందుకే బాక్సింగ్ లో సెమిస్ చేరితే పతకం గ్యారంటీ అనేది.  

ఇక మరో బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్ థాయ్ బాక్సర్ సూడాపోన్ చేతిలో ఓటమి చెందింది. మహిళల 60 కేజీల రౌండ్ ఆఫ్ 16 లో సిమ్రన్జీత్ ఓటమి చెందింది. తొలి రౌండ్లో వాస్తవానికి తన ప్రత్యర్థిపై తాను పైచేయి సాధించానని సిమ్రన్జీత్ భావించినప్పటికీ... తను  సరిపోను పాయింట్లు స్కోర్ చేసిందని భావించినప్పటికీ... జడ్జిలస్కోరే అందుకు విరుద్ధంగా ఉండడం సిమ్రన్ పై భారీ ప్రభావాన్ని చూపెట్టినట్టుంది. 

రెండవ రౌండ్లో ప్రత్యర్థి పై పైచేయి సాధించడానికి గార్డ్ ను వదిలేసి ప్రత్యర్థి పై పంచులు కురిపించేందుకు యత్నించిన నేపథ్యంలో ప్రత్యర్థి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని సిమ్రన్జీత్ పై పాయింట్లను సాధించింది. 

సిమ్రన్జీత్ పంచులు చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ... థాయ్ బాక్సర్ తెలివిగా ఆడింది. అంతే కాకుండా కోవిడ్ తరువాత సిమ్రన్జీత్ కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. కోవిడ్ బారినప్పడినుండి ఆమె స్పీడ్,ఎండ్యూరెన్సు లో చాలా తేడాని గమనించవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios