టక్యో ఒలింపిక్స్: సెమీస్ చేరిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియా...
ఇరాన్ రెజ్లర్ మోర్తేజా గియాసీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచిన భజరంగ్ పూనియా...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. 65 కేజీల ఫ్రీ స్టైయిల్ విభాగంలో ఇరాన్ రెజ్లర్ మోర్తేజా గియాసీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 2-1 తేడాతో ఓడించాడు భజరంగ్ పూనియా.
అంతకుముందు రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో పోటీపడిన సీమా బిస్లా తొలి రౌండ్‌లోనే పోరాడి ఓడింది. సీమా బిస్లాను ఓడించిన టునిషియాకి చెందిన సర్రా హమ్డీ, క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోవడంతో భారత రెజ్లర్‌కి రెపిఛాజ్ కూడా లభించలేదు.
కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు పోరాడి ఓడింది. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓడిన భారత మహిళా హాకీ టీమ్, 1980 తర్వాత ఒలింపిక్స్‌లో నాలుగో స్థానానికి పరిమితమైంది.
50 కి.మీ.ల రేసులో పాల్గొన్న భారత అథ్లెట్ గుర్‌ప్రీత్ సింగ్, పోటీ మధ్యలో నుంచే తప్పుకున్నాడు. 35 కి.మీ. దూరం నడిచిన గుర్‌ప్రీత్ సింగ్, శరీరం సహకరించకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. 25 కి.మీ.ల రేసు ముగిసే సమయానికి 49వ పొజిషన్‌లో ఉన్నాడు గుర్‌ప్రీత్ సింగ్.