కొరియా ఆర్చర్ టీమ్ చేతుల్లో 6-0 తేడాతో ఓడిన భారత మెన్స్ ఆర్చరీ టీమ్...కొరియా ఆర్చరీ టీమ్ ముందు నిలవలేకపోయిన అథాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్... 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీమ్ పోరాటం ముగిసింది. మెన్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్లు అథాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్... కొరియా ఆర్చర్ టీమ్ చేతుల్లో 6-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్కమించారు.

మొదటి సెట్‌లో కొరియా 59 పాయింట్లు సాధించగా, భారత ఆర్చరీ టీమ్ 54 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. మొదటి సెట్ నుంచి ఆరో సెట్‌ వరకూ ఏ దశలోనూ కొరియా టీమ్‌కి పోటీ ఇవ్వలేకపోయిన భారత ఆర్చరీ జట్టు... 

టోక్యో ఒలింపిక్స్‌కి ముందు జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్‌లో అద్భుతాలు చేసిన భారత ఆర్చరీ జట్టు, విశ్వక్రీడా వేదికపై మాత్రం తీవ్రంగా నిరుత్సాహపరిచింది.

వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారితో పాటు అథాను దాస్, అభిషేక్ వర్మ, ప్రవీణ్ జాదవ్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఆర్చరీ వరల్డ్‌కప్‌లో 7 స్వర్ణాలు సాధించిన భారత ఆర్చరీ టీమ్, టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం పతకానికి దగ్గరగా కూడా చేరుకోలేకపోయారు.