టోక్యో ఒలింపిక్స్: భారత బాక్సర్ లవ్‌లీనా విజయం... క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు...
69 కేజీల విభాగంలో జరిగిన రెండో రౌండ్‌లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా...
టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లోకి దూసుకెళ్లిన మొదటి భారత బాక్సర్‌లా లవ్‌లీనా...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్‌లీనా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 69 కేజీల విభాగంలో జరిగిన రెండో రౌండ్‌లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
అపెజ్‌పై తొలి రౌండ్ నుంచి ఆధిక్యం చూపించిన లవ్‌లీనా... మూడు రౌండ్లలోనూ మంచి పాయింట్లు సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. మొదటి రౌండ్‌లో లవ్‌లీనాకు బై దొరకడంతో నేరుగా రెండో రౌండ్‌కి అర్హత సాధించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం భారత్‌కి మిశ్రమ ఆరంభం దక్కింది. భారత పురుషుల హాకీ జట్టు, స్పెయిన్‌పై విజయం సాధించగా... టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మూడో రౌండ్‌లో ఓడి నిష్కమించాడు.
బ్యాడ్మింటన్‌లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి రెండో విజయాన్ని అందుకున్నా, గ్రూప్‌లో మూడో స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు.
షూటింగ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అంజుమ్-దీపక్ కుమార్, ఎలవెనిల్ - దివ్యాంశ్ జోడి ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు.