Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: రెండో స్థానం నుంచి 23వ స్పాట్‌కి... పోరాడి ఓడిన సందీప్ కుమార్...

 రేసు ఆరంభం నుంచి 8 కి.మీ.ల ముగిసేవరకూ చైనా అథ్లెట్ వాంగ్‌తో కలిసి లీడ్‌లో సందీప్ కుమార్...

Tokyo Olympics 2020: Indian Athlete Sandeep Kumar finished race in 23rd spot CRA
Author
India, First Published Aug 5, 2021, 2:50 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో 20 కిమీల వాకింగ్ రేసులో భారత అథ్లెట్ సందీప్ కుమార్, ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు. రేసు ఆరంభం నుంచి 8 కి.మీ.ల ముగిసేవరకూ చైనా అథ్లెట్ వాంగ్‌తో కలిసి లీడ్‌లో కనిపించాడు సందీప్ కుమార్...

అయితే 8 కి.మీ. రేసు ముగిసిన తర్వాత రిఫరీ నుంచి వార్నింగ్ ఎదుర్కొన్న తర్వాత సందీప్ కుమార్ నడకలో వేగం తగ్గింది. మెల్లిమెల్లిగా రేసులో వెనక్కి వెళ్లిపోయిన సందీప్ కుమార్, 1:25:07 టైంలో రేసును ముగించి, 23వ స్థానంలో నిలిచాడు...

సందీప్ కుమార్ కంటే ముందున్న చైనా అథ్లెట్ వాంగ్, రేసును ఏడో స్థానంలో ముగించడం విశేషం. ఇటలీకి చెందిన ముసిమో స్టానో రేసును 1:21:05 టైంలో ముగించి, గోల్డ్ సాధించగా... సిల్వర్, కాంస్య పతకాలు జపాన్‌‌కి దక్కాయి. 

టీమిండియా తరుపున 20 కి.మీ.ల రేసులో నిలిచిన రాహుల్ 47వ స్థానంలో, కేటీ ఇర్ఫాన్ 51వ స్థానంలో నిలిచి రేసును ముగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios