టోక్యో ఒలింపిక్స్: తొలి స్వర్ణ పతకం సాధించిన చైనా... షూటర్ యాంగ్ కియాన్‌కి...
ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసిన చైనా షూటర్ యాంగ్ కియాన్...
రష్యన్ షూటర్ అనాస్తాసియా గలాసినా రజతం... స్విట్జర్లాండ్‌కి చెందిన నైనా క్రిస్టెన్‌కి కాంస్యం
టోక్యో ఒలింపిక్స్ 2020లో తొలి స్వర్ణ పతకం సాధించిన దేశంగా చైనా టాప్‌లో నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో 251.8 పాయింట్లలో ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసిన చైనా షూటర్ యాంగ్ కియాన్ స్వర్ణ పతకం సాధించింది.
రష్యన్ షూటర్ అనాస్తాసియా గలాసినా రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా, స్విట్జర్లాండ్‌కి చెందిన నైనా క్రిస్టెన్‌కి కాంస్యం గెలుచుకుంది.
భారత వరల్డ్ నెం.1 షూటర్ ఎలవెనిల్ వలరివన్ 626.5 స్కోరుతో 16వ స్థానంలో ముగించగా, వరల్డ్ రికార్డు హోల్డర్ అపూర్వీ చండేలా 36వ స్థానంలో ముగించింది.