టోక్యో ఒలింపిక్స్: కాంస్య పతక పోరులో పోరాడి ఓడిన దీపక్ పూనియా...

ఆఖరి 30 సెకన్లలో ప్రత్యర్థికి 2 పాయింట్ల అప్పగించడంతో ఓటమి పాలైన దీపక్ పూనియా...

Tokyo 2020: wrestler Deepak Punia losses in Bronze Medal match CRA

టోక్యో ఒలింపిక్స్ 86 కేజీల విభాగంలో కాంస్య పతక పోరులో సాన్ మెరినో‌కి చెందిన మైలెస్ అమైన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత రెజ్లర్ దీపక్ పూనియా... 2-3 తేడాత పోరాడి ఓడాడు.

తొలి హాఫ్ ముగిసే సమయానికి 2-1 ఆధిక్యంలో ఉన్న దీపక్ పూనియా... ఆఖరి 30 సెకన్లలో ప్రత్యర్థికి 2 పాయింట్ల అప్పగించడంతో ఓటమి పాలయ్యాడు. అంపైర్ల నిర్ణయాన్ని దీపక్ పూనియా కోచ్ ఛాలెంజ్ చేసినా ఫలితం దక్కలేదు...

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్ 2020 రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా... తుది మెట్టు మీద పోరాడి ఓడాడు. 57 కేజీల విభాగంలో రష్యాకి చెందిన జవుర్ ఉగేవ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రవికుమార్ దహియా... 4-7 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.  

తొలి బ్రేక్‌ సమయానికి 2-4 తేడాతో ఆధిక్యం సాధించిన జవుర్, ఆ తర్వాత వరుస పాయింట్లు స్కోరు చేసి 2-7 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించిన రవికుమార్ 4-7 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు. 

2012 లండన్ ఒలింపక్స్‌తో రజతం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన భారత రెజ్లర్‌గా నిలిచాడు రవికుమార్ దహియా... 
 
రవికుమార్ దహియా పతకంతో కలిపి టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 5కి చేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాను ఛాను రజతం సాధించగా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్‌లీనా కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ, జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios