టోక్యో ఒలింపిక్స్: టెన్నిస్‌లోనూ నిరాశే... రెండో రౌండ్‌లో పోరాడి ఓడిన సుమిత్ నగల్...
వరల్డ్ నెం.1 డానిల్ మెడెదేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 1-6 తేడాతో పోరాడి ఓడిన సుమిత్ నగల్...
టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన భారత టెన్నిస్ ప్లేయర్ల పోరాటం...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశపూరిత ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. 25 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌కి చేరిన భారత మెన్స్ సింగిల్ టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సుమిత్ నగల్, ఇంటిదారి పట్టాడు.
రెండో రౌండ్‌లో వరల్డ్ నెం.1 డానిల్ మెడెదేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 1-6 తేడాతో పోరాడి ఓడిపోయాడు సుమిత్ నగల్. సుమిత్ నగల్‌తో టోక్యో ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ టీమ్ పోరాటం కూడా ముగిసింది.
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా- అంకితా రైనా జోడి, తొలి రౌండ్‌లోనే ఓడిన విషయం తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత జట్టుకి పెద్దగా కలిసి రావడం లేదు. భారత ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడగా, టీటీ ప్లేయర్ సుత్రీత, బ్యాడింటన్ డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ఫెన్సర్ భవానీ దేవీ రెండో రౌండ్‌లో ఓడారు. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మాత్రం రెండో రౌండ్‌లో గెలిచి, మూడో రౌండ్‌కి అర్హత సాధించాడు.