టోక్యో ఒలింపిక్స్: ముగిసిన ద్యుతీ చంద్ పోరాటం... క్వాలిఫికేషన్స్ రౌండ్ నుంచే...

200 మీటర్ల రేసులో ఏడో స్థానంలో నిలిచిన ద్యుతీ చంద్... క్వాలిఫికేషన్స్ రౌండ్ నుంచే అవుట్...

Tokyo 2020: Dutee Chand Failed to Qualify for Semi-finals in 200m Race CRA

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ పోరాటం ముగిసింది. 200 మీటర్ల రేసులో ఏడో స్థానంలో నిలిచిన ద్యుతీ చంద్, సెమీ-ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయింది. రేసును 23.85 సెకన్లలో పూర్తిచేసిన ద్యుతీ... హీట్‌లో ఏడో స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. 

ద్యుతీ పర్సనల్ బెస్ట్ 23.00 కాగా ఈ సీజన్‌లో ఇదే బెస్ట్ టైమింగ్. 100 మీటర్ల రేసులో కూడా ఏడో స్థానంలో నిలిచిన ద్యుతీ చంద్, మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్‌ని ముగించింది. ఒలింపిక్స్ పతకం తెస్తుందని ఆశపడిన యంగ్ స్ప్రింటర్ హిమా దాస్ గాయం కారణంగా విశ్వక్రీడల్లో పాల్గొనని విషయం తెలిసిందే. 

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కి అర్హత సాధించిన భారత మహిళా హాకీ జట్టు నేడు పటిష్ట ఆస్ట్రేలియాతో తలబడనుంది. అలాగే డిస్కస్ త్రోలో ఫైనల్‌కి అర్హత సాధించిన కమల్‌ప్రీత్ కౌర్ కూడా నేటి సాయంత్రం పోటీల్లో నిలవనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios