Ashwini Ponnappa: ఇదే నా చివరి ఒలింపిక్స్.. ఏడ్చేసిన అశ్విని పొన్నప్ప
Ashwini Ponnappa : పారిస్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి తనీషా క్రాస్టోతో కలిసి ఓటమి పాలవడంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప తన ఒలింపిక్స్ ప్రయాణం ముగిసిందని భావోద్వేగంతో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.
Ashwini Ponnappa : భారత బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప ఏడ్చేశారు. తన ఒలింపిక్స్ ప్రయాణం ముగిసిందని పేర్కొంటూ ఎమోషనల్ అయ్యారు. మంగళవారం పారిస్ ఒలింపిక్ గేమ్స్ మహిళల డబుల్స్ పోటీలో తన భాగస్వామి తనీషా క్రాస్టో తో కలిసి వరుసగా మూడో ఓటమిని చవిచూసిన తర్వాత తన చివరి ఒలింపిక్స్‌లో ఆడినట్లు ప్రకటించారు. గ్రూప్ సి చివరి గేమ్‌లో అశ్విని-తనీషా 15-21, 10-21తో ఆస్ట్రేలియాకు చెందిన సెట్యానా మపాసా, ఏంజెలా యు చేతిలో ఓడిపోయారు. వారు తమ మూడు గ్రూప్ మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత పారిస్ ఒలింపిక్స్ నుంచి ఔట్ అయ్యారు.
ఈ క్రమంలోనే 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో ఆడాలని భావిస్తున్నారా అని అడిగినప్పుడు.. "ఇది నా చివరిది, కానీ తానీషా చాలా దూరం వెళ్ళాలి" అని తన మూడవ ఒలింపిక్స్‌లో ఆడుతున్న 34 ఏళ్ల అశ్విని పొన్నప్ప చెప్పింది. అలాగే, "ఎమోషనల్‌గానూ, మెంటల్‌గానూ చాలా ఇబ్బంది పడతాను, నేను మళ్ళీ దీని జోలికి వెళ్ళలేను. ఇది అంత తేలిక కాదు, మీరు కొంచెం చిన్నవారైతే ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంత కాలం ఆడిన నేను ఇక భరించలేను" అంటూ అశ్విని పొన్నప్ప కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది.
paris olympics : గ్రూప్ స్టేజ్‌లో టాప్ లో భారత హాకీ జట్టు.. క్వార్టర్స్ బెర్త్ ఖాయం
అశ్విని పొన్నప్ప బ్యాడ్మింటన్ కెరీర్ గమనిస్తే..
2001లో తన తొలి జాతీయ టైటిల్‌ను గెలుచుకున్న అశ్విని, గుత్తా జ్వాలాతో కలిసి అద్భుత భాగస్వామ్యంతో అనేక రికార్డులు సాధించారు. వీరిద్దరూ 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, ఉబెర్ కప్ (2014, 2016), ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో (2014) కాంస్యంతో సహా అనేక అంతర్జాతీయ పతకాలను గెలుచుకున్నారు. 2011లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన తొలి భారతీయ జంటగా చరిత్ర సృష్టించారు. అది వారి కెరీర్‌లో అతిపెద్ద బహుమతి. గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్పల జోడీ నిలకడగా ప్రపంచంలోని టాప్ 20 ర్యాంక్‌లలో నిలిచింది. ఒకేసారి 10వ స్థానానికి చేరుకుంది. అశ్విని, జ్వాల కలిసి రెండు ఒలింపిక్స్‌లో (2012, 2016లో) ఆడినా తొలి దశ దాటి ముందుకు వెళ్లలేకపోయారు.
"మేము ఈరోజు విజయం సాధించాలనుకుంటున్నాము. ఫలితం భిన్నంగా.. మెరుగ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము, నేను-తనీషా కలిగి ఉన్న అతిపెద్ద టేక్‌అవే మేము చాలా ప్రయాణం చేసాము.. ఒలింపిక్స్‌లో చేరడం. ఇది అంత సులభం కాదని కూడా" అశ్విని పేర్కొన్నారు. తనీషా కూడా వరుస ఓటములతో పారిస్ ఒలింపిక్స్ నుంచి ఔట్ అయిన తర్వాత తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. ఆమె అసహనంగా.. నిరాశతో కనిపించారు. "ఆమె (అశ్విని) ఇక్కడ నాకు అతిపెద్ద మద్దతుగా ఉంది. మేము మెరుగైన ఫలితాన్ని కోరుకున్నాము. దాని కోసం ప్రయత్నం చేశాం. ఓటమి దిశగా సాగిన ప్రతిసారీ ఆమె నన్ను ప్రేరేపించింది" అని తనీషా చెప్పారు.
PARIS OLYMPIC: భారత్ కు రెండో ఒలింపిక్ మెడల్.. ఎవరీ సరబ్‌జోత్ సింగ్?