జర్మనీ కోచ్ శాలరీ చాలా కాస్ట్‌లీ గురూ! : తర్వాతీ స్థానంలో బ్రెజిల్ మేనేజర్

The Highest Paid Coaches At 2018 World Cup Revealed
Highlights

జర్మనీ కోచ్ శాలరీ చాలా కాస్ట్‌లీ గురూ!

హైదరాబాద్: రష్యాలో సాకర్ సంరంభం ప్రారంభం కావడానికి మరో 0 రోజుల గడువు మాత్రమే ఉన్నది. ప్రాతినిధ్య జట్లన్నీ అందుకు అనుగుణంగా శిక్షణ పొందుతూ, వ్యూహ, ప్రతివ్యూహాలు అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాయి. 2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్ ఈ దఫా ఎలాగైనా టైటిల్ చేజిక్కించుకోవాలని కలలు కంటున్నది. అందుకు అనుగుణంగానే అత్యంత నిపుణుడైన కోచ్ టైట్‌ను నియమించుకున్నది బ్రెజిల్. కాకపోతే ప్రస్తుతం 2018 ప్రపంచ కప్ టోర్నీలో తల పడుతున్న జట్ల కోచ్‌ల్లోకెల్లా బ్రెజిల్ కోచ్ టైట్ వేతనాలు అందుకునే వారిలో రెండో స్థానంలో ఉన్నారు. బఫానా మాజీ కోచ్ కూడా వేతనం తీసుకుంటున్న టాప్ 10 మెంబర్లలో ఒకరిగా ఉండే వారు. అంతే కాదు రష్యా టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్ల కోచ్‌ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం:

2014 జర్మనీ విజయంలో కోచ్ జొయాచిం ఇలా కీలకం 
2014లో సాకర్ కప్ టైటిల్ గెలుచుకోవడంలో జర్మనీ కోచ్ జోయాచింలో కీలక పాత్ర వహించాడు. ఆయన రష్యాలో అత్యధిక వేతనం పొందుతున్న కోచ్ కం మేనేజర్ అంటే ఆశ్చర్యకరమైన పరిణామమేం కాదు. ఏటా 3.31 మిలియన్ల యూరోల (55 మిలియన్ల రూపాయల) వేతనం పొందుతున్నాడు జొయాచిం. తర్వాతీ స్థానంలో ఏడాదికి బ్రెజిల్ కోచ్ టైట్ వేతనం 3.02 మిలియన్ల యూరోలు (రూ.50 మిలియన్లు) 

                   
 

బ్రెజిల్ ప్లస్ ఫ్రాన్స్ కోచ్ వేతనం సమానమే
బ్రెజిల్ కోచ్ టైట్ తీసుకుంటున్న వేతనాన్నే ఫ్రాన్స్ మేనేజర్ డిడియర్ డెస్‌చాంప్స్ తీసుకుంటున్నాడు. ఫ్రాన్స్ జట్టు కోచ్ జులైన్ లొపెటెగౌ వేతనం 2.58 మిలియన్ల యూరోలు (రూ.43 మిలియన్లు) తీసుకుంటున్నారు. ఇక ఆతిథ్య జట్టు రష్యా కోచ్ స్లానిస్లావ్ చెర్చేసోవ్ ఏడాదికి 2.21 మిలియన్ల యూరోలు (రూ.37 మిలియన్లు) వేతనం అందుకుంటున్నాడు. 
 

                 
ఏడో స్థానంలో ఇరాన్ కోచ్ శాలరీ
ప్రస్తుతం ఇరాన్ కోచ్ గా సేవలందిస్తున్న మాజీ దక్షిణాఫ్రికా కోచ్ కార్లోస్ క్వైరోజ్ వేతనాలతో పోలిస్తే ఏడో స్థానంలో నిలిచాడని తెలుస్తున్నది. ఏటా రూ.28 మిలియన్లు (1.69 మిలియన్ల యూరోలు) వేతనంగా అందుకుంటున్నాడు. ఇంగ్లండ్ బాస్ గారెథ్ సౌత్ గేట్ వార్షిక వేతనం కూడా కార్లోస్ క్వైరోజ్ వేతనంతో సమానం. 

                 

హెక్టర్ కూపర్ ఆఫ్రికా నుంచి టాపర్
ఆఫ్రికన్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్న జట్లలో అత్యధిక వేతనం పొందుతున్న కోచ్ హెక్టర్ కూపర్ 11వ స్థానంలో నిలిచారు. ఇక ఈజిప్టు కోచ్ 1.30 మిలియన్ల యూరోలు (22 మిలియన్ల రూపాయలు) వేతనం అందుకుంటున్నాడు. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్న జట్ల కోచ్‌ల వేతనాలు 10 లక్షల యూరోలు తీసుకుంటున్న వారు ఉన్నారు. 

           

భద్రతా చర్యలు పెంపొందించిన రష్యా
వచ్చేనెల 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ సందర్భంగా అత్యాధునిక భద్రతా చర్యలను ప్రవేశపెట్టనున్నది. మ్యాచ్ లు జరిగే నగరాల పరిధిలో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించింది. వాటర్ వేస్, కోస్ట్ లైన్స్ వెంబడి కూడా భద్రత విస్త్రుతంగానే ఉన్నది. వరల్డ్ కప్ జరిగే స్టేడియంలు వద్ద, క్రీడాకారులు బస చేసే హోటళ్లు, బేస్ క్యాంపుల వద్ద మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కొన్ని చోట్ల భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు.
                               
 

loader