నేపియర్ లో మొదటి వన్డే విజయం తర్వాత భారత జట్టు రెండో వన్డే మౌంట్ మంగనూయిలో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆ నగరానికి చేరుకున్న ఆటగాళ్లు ఇవాళ బే ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. అయితే అంతకు ముందే ప్రాక్టిస్ కోసం మైదానంలోకి చేరుకున్న ఆటగాళ్లకు న్యూజిలాండ్ సాంప్రదాయ నృత్యంతో స్వాగతం లభించింది.

స్థానికంగా వుండే మవోరి తెగకు చెందిన సాంప్రదాయ హాకా  నృత్యంతో భారత ఆటగాళ్లకు, సిబ్బందికి ఘన స్వాగతం లభించింది. అడవి బిడ్డలకు సంబంధించిన ఆ నృత్యాన్ని చూసి భారత సిబ్బంది ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బిసిసిఐ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

ఈ న్యూజిలాండ్ సాంప్రదాయ నృత్యంపై ధావన్ మాట్లాడుతూ...ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలను తాను చాలా ఇష్టపడతానన్నారు.  అంతే కాకుండా వాటిని  గౌరవిస్తానన్నారు. న్యూజిలాండ్‌ సాంప్రదాయంలో భాగమైన హాకా నృత్యం చూసేందుకు ఎంతో బాగుంటుందన్నారు. మవోరి తెగకు చెందిన వారు స్వాగతం పలుకుతూ చేసిన హాకా నృత్యం చూసి భారత బృందం సంతోషించిందన్నారు. వారి వద్ద నుండి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నామని ధావన్ తెలిపాడు. 

వీడియో