నెలలు నిండాయి.. రవిశాస్త్రికి త్వరలో డెలివరీ

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 10, Aug 2018, 12:17 PM IST
team india fans setires on Ravi shastri belly
Highlights

టీమిండియా కోచ్ రవిశాస్త్రి నెటిజన్లకు పదే పదే టార్గెట్ అవుతున్నారు. మొన్నా మొదటి టెస్ట్ మ్యాచ్ మధ్యలో నిద్రపోయినందుకు భారత అభిమానులు ఫైరయ్యారు. 

టీమిండియా కోచ్ రవిశాస్త్రి నెటిజన్లకు పదే పదే టార్గెట్ అవుతున్నారు. మొన్నా మొదటి టెస్ట్ మ్యాచ్ మధ్యలో నిద్రపోయినందుకు భారత అభిమానులు ఫైరయ్యారు. నిన్న లండన్‌లో వేడిని తట్టుకోలేక కూల్‌డ్రింక్ తాగమన్నందుకు.. రవిశాస్త్రి తాగుబోతని... జట్టుకు సలహాలు ఇవ్వకుండా కూల్‌‌డ్రింక్స్ అమ్ముకుంటున్నాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా లార్డ్స్ గ్రౌండ్ పిచ్‌ను పరిశీలిస్తున్న రవిశాస్త్రి ఫోటోపై కామెంట్లు పేల్చారు నెటిజన్లు.

ఈ ఫోటోలో రవి పొట్ట కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై సెటైర్లు పేలుతున్నాయి. ‘‘ఆటగాడిగా ఉన్నప్పుడు ఫిట్‌నెస్ బాగానే మెయింటెన్ చేశావ్.. కోచ్ అయ్యాకా ఏమైంది’’, ‘‘ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలి అంటాడు.... అతను మాత్రం బాడీ పెంచేస్తున్నాడు’’.. ‘‘రవిశాస్త్రి డెలివరీకి సిద్ధంగా ఉన్నాడు.. కోచ్‌కు యో యో టెస్ట్‌ పెట్టాలేమో’’ అంటూ విమర్శలు సంధిస్తున్నారు.

‘‘పొట్టను పెంచడం నేరమేమి కాదు.. కానీ డైటింగ్ కూడా అవసరం ముందు అది గమనించు’’, ‘‘ లార్డ్స్‌లో ఎవరు గెలిచినా.. బెల్లీ విన్నర్ మాత్రం రవిశాస్త్రే’’ అంటూ చిత్ర విచిత్రంగా పోస్టులు చేస్తున్నారు. దీంతో రవిశాస్త్రి పొట్టపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.

loader