Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ లేకపోయినా టీంఇండియా ఉత్తమ జట్టే : సౌరవ్ గంగూలీ

ఈ మధ్య టీంఇండియా బ్యాంటింగ్ విభాగంలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే జరిగింది. కోహ్లీ ఒక్కడే బ్యాంటింగ్ లో రాణించి 5 టెస్టుల సీరీస్ లో 440 పరుగులు సాధించి  మ్యాన్  ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ దరిదాపుల్లో కూడా ఏ ఇండియన్ బ్యాట్ మెన్ పరుగులు లేవు. దీంతో పలువురు మాజీలు విరాట్ పై ఇంతలా ఆధాపరపటం మంచిది కాదని సూచించారు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ కు భారత జట్టులో కోహ్లీని ఎంపిక చేయకుండా విశ్రాంతి నివ్వడాన్ని కూడా వారు తప్పుబడుతున్న విషయం తెలిసిందే.
 
team india  ex captain sourav ganguly statements about asia cup
Author
Kolkata, First Published Sep 18, 2018, 4:31 PM IST

ఈ మధ్య టీంఇండియా బ్యాంటింగ్ విభాగంలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే జరిగింది. కోహ్లీ ఒక్కడే బ్యాంటింగ్ లో రాణించి 5 టెస్టుల సీరీస్ లో 440 పరుగులు సాధించి  మ్యాన్  ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ దరిదాపుల్లో కూడా ఏ ఇండియన్ బ్యాట్ మెన్ పరుగులు లేవు. దీంతో పలువురు మాజీలు విరాట్ పై ఇంతలా ఆధాపరపటం మంచిది కాదని సూచించారు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ కు భారత జట్టులో కోహ్లీని ఎంపిక చేయకుండా విశ్రాంతి నివ్వడాన్ని కూడా వారు తప్పుబడుతున్న విషయం తెలిసిందే.

అయితే టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ఈ విషయంలో సెలెక్టర్లకు సపోర్టు చేశాడు. కోహ్లీ లేకున్నా ఆసియా కప్ లో భారత్ తరపున బలమైన జట్టే బరిలోకి దిగుతోందని గంగూలీ తెలిపారు. విరాట్ కోహ్లీ లేకున్నా భారత జట్టు అత్యుత్తమ జట్టే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో కోహ్లీ లేకపోవడం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వ్యాఖ్యానించారు.

దాయాదుల పోరులో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని గంగూలీ అన్నారు. అత్యుత్తమంగా ఆడిన జట్టే విజేతగా నిలుస్తుందని తెలిపారు. రోహిత్ సారథ్యంలోని ప్రస్తుత జట్టు బలంగానే కనిపిస్తోందని గంగూలీ స్పష్టం చేశారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios