భారత క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. టెస్ట్, వన్డేల్లో జట్టును నెంబర్‌వన్ ప్లేస్‌లో పెట్టిన ధీశాలి, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లను అందుకున్న ఏకైక కెప్టెన్.. అయినా భార్య అంటే ఎంతో ప్రేమ.

ఈ విషయం ఎవరి గురించో మీకు ఈపాటికే అర్ధమై ఉండాలి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధోనీ తన భార్య సాక్షిని అపురూపంగా చూసుకుంటాడు. వీరి మధ్య అనుబంధాన్ని సాక్షి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.  ఈ ఫోటోల్లో సాక్షి నిలబడి ఉండగా.. ధోనీ ఆమెకు చెప్పులు తొడుగుతూ ఉండటమే.. వీటికి క్యాప్షన్‌గా ‘‘షూస్‌కి నువ్వే డబ్బులు కట్టావ్.. ఇప్పుడు నువ్వే వాటిని తొడుగు’’ అంటూ పెట్టింది. అయితే దీనికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. భార్యంటే ప్రేమ ఉండాలే కానీ... మరి ఇంతలానా అంటూ ఒకరు.. ‘భార్య ముందు కెప్టెన్సీ చెల్లదని మరొకరు కామెంట్ చేస్తున్నారు. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

You paid for the shoes so you tie them tooo 🤗😘 !!! Photo Credit - @k.a.b.b.s

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Dec 15, 2018 at 9:54am PST