కోహ్లీ ఫ్యాన్స్‌కు చేదువార్త.. ఆసియాకప్‌కు విరాట్ డౌటే..?

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 31, Aug 2018, 6:30 PM IST
team india captain virat kohli may be rest for asia cup
Highlights

మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత అభిమానులకు ఒక చేదువార్త.. ఆసియా కప్‌ కు ప్రకటించబోయే భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ఉండే అవకాశం అనుమానంగా కనిపిస్తోంది

మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత అభిమానులకు ఒక చేదువార్త.. ఆసియా కప్‌ కు ప్రకటించబోయే భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ఉండే అవకాశం అనుమానంగా కనిపిస్తోంది.

వరుస మ్యాచ్‌లతో విరాట్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు బ్యాటింగ్ భారాన్ని అతడే మోస్తున్నారు. ఇప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతున్న విరాట్‌.. ఆసియా కప్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్‌కు రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఇది అతని ఆరోగ్యంపైనా, ఆటపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటం.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ ఉండటంతో సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశం కనిపిస్తుంది.

అదే నిజమైతే ఆసియాకప్‌లో టీమిండియా సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ నిర్వహించనున్నాడు. ప్రపంచకప్‌కు మేటి జట్టును సిద్ధం చేయాలని నిర్ణయించిన సెలక్టర్లు మిడిలార్డర్‌లో ప్రయోగాలు చేయాలని భావిస్తున్నారు. భారత్- ఏ, భారత్- బి జట్ల తరపున రాణించిన మనీష్ పాండే, అంబటి రాయుడులకు అవకాశం లభించవచ్చు.

అలాగే కర్ణాటక, భారత్- ఏ తరపున అద్భుతంగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్‌కు కూడా ఛాన్స్ ఉండవచ్చు.. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్, బుమ్రాలు భారాన్ని పంచుకుంటారు. సీనియర్, మాజీ కెప్టెన్ ధోనికి ప్రత్యామ్నాయంగా రిషబ్ పంత్‌కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రిషబ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సెప్టెంబర్ 15 నుంచి అబుదాబి, దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానుంది.

loader