ఈ ఏడాది టెస్టులు, వన్డేలు అన్న తేడా లేకుండా భీకర ఫాంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన ఫాంను ఆస్ట్రేలియాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు
ఈ ఏడాది టెస్టులు, వన్డేలు అన్న తేడా లేకుండా భీకర ఫాంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన ఫాంను ఆస్ట్రేలియాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు.
ఇది అతనికి టెస్టుల్లో 25వ సెంచరీ కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో భాగంగా 214 బంతులను ఎదుర్కోన్న విరాట్ కోహ్లీ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 25 శతకాలు సాధించిన క్రికెటర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు.
కోహ్లీ 127 ఇన్నింగ్సుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. ఆసీస్ అల్‌టైమ్ గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 68 ఇన్నింగ్స్‌ల్లోనే 25 సెంచరీలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరి తర్వాత సచిన్ 130, గావస్కర్ 138, హేడెన్ 139 ఇన్నింగ్స్‌ల్లో 25 సెంచరీలు చేశారు.
ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు సాధించిన భారత బ్యాట్స్‌మన్లలో 11 శతకాలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెంబర్‌వన్ ప్లేస్‌లో ఉన్నారు. గావస్కర్ 8, కోహ్లీ 7, లక్ష్మణ్ 6, మురళీ విజయ్ 4 సెంచరీలు సాధించారు. కాగా, విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీల్లో 6 ఆసీస్ గడ్డపై చేసినవే.
