Asianet News TeluguAsianet News Telugu

రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. గాయంతో బాధపడుతూనే ఒంటి చేత్తో బ్యాటింగ్

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు. 

tamim iqbal bats one handed in asiacup
Author
Dubai - United Arab Emirates, First Published Sep 17, 2018, 11:29 AM IST

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేసి ఔరా అనిపించాడు.

లంక బౌలర్‌ లక్మల్‌ వేసిన రెండో ఓవర్‌లో ఇక్బాల్‌ ఎడమ చేతి మణికట్టుకి బంతి బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. దీంతో అతను రెండో ఓవర్‌లోనే రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు ముష్ఫికర్‌ రహీమ్‌ పోరాడుతున్నా మరోవైపు నుంచి సహాకారం లేక వికెట్లు పడుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే బంగ్లా తొమ్మిదో టికెట్‌ను కోల్పోయింది. రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగిన ఇక్బాల్‌ ఇబ్బందుల్లో ఉన్న జట్టు కోసం గాయంతోనే పదో వికెట్‌గా క్రీజ్‌లోకి వచ్చి ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేశాడు. గాయం కారణంగా బాధపడుతునే ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ ప్రేమికులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దేశం కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేయడం గ్రేట్‌.. నీ ధైర్యానికి సెల్యూట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ 137 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా తరువాత జరిగే మ్యాచ్‌కు తమీమ్‌ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలవాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios