ఇద్దరు మెరుపు ఆటగాళ్లు దూరం.. స్వీడన్ నిలబడుతుందా..?

ఫిఫా వరల్డ్ కప్‌లో గ్రూప్‌ల సమరం ముగిసింది. టోర్నీలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్వార్టర్స్‌ అంచనాలకు మించి మజాను అందజేస్తోంది. ఇప్పటికే అగ్రశ్రేణి జట్లు, హాట్ ఫేవరేట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ దశలో ఏ చిన్న తప్పు చేసినా ప్రపంచకప్‌ నుంచి తప్పుకోవాల్సిందే. అందుకే అన్ని జట్లు పకడ్బంధీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

అయితే కొన్ని జట్లలోని కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు.. ఆయా జట్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఇవాళ స్వీడన్- స్విట్జర్లాండ్ జట్ల మధ్య సమరం జరగనుంది. అయితే స్వీడన్‌కు చెందిన దిగ్గజ ఆటగాళ్లు.. జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన జ్లాటన్, డిజౌరు ఇవాళ అందుబాటులో ఉండకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.. అయితే తాము లేకపోయినా.. జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని.. మిగిలిన ఆటగాళ్లు స్వీడన్‌కు విజయాన్ని అందిస్తారని డిజౌరు తెలిపాడు. 

"