రిషబ్ పంత్ ను తిట్టిన స్టువర్ట్ బ్రాడ్: ఫీజులో కోత

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 22, Aug 2018, 1:26 PM IST
Stuart Broad fined 15 per cent for abusive Rishabh Pant send-off
Highlights

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఇంగ్లాండు ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తిట్టాడు. ఇంగ్లండు, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు రెండో రోజు ఆటలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

నాటింగ్ హామ్: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఇంగ్లాండు ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తిట్టాడు. ఇంగ్లండు, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు రెండో రోజు ఆటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అందుకు గాను బ్రాడ్ కు మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధించారు. 

ఐసిసి ప్రవర్తనా నియమావళిలని ఆర్టికల్ 2.1.7ను ఉల్లంఘించాడనే ఆరోపణపై బ్రాడ్ కు ఆ జరిమానా విధించారు. అంతేకాకుండా బ్రాడ్ క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరుతుంది. 

ఆదివారంనాడు 92వ ఓవరులో రిషబ్ పంత్ అవుటయ్యాడు. క్రీజు బయటకు వెళ్తున్న పంత్ వద్దకు వెళ్లి బ్రాడ్ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడాడు. బ్రాడ్ తన తప్పును అంగీకరించాడు. 

బ్రాడ్ పై అంపైర్లు మారైస్ ఎరాస్మస్, క్రిస్ గఫనేలతో పాటు థర్డ్ అంపైర్ అలీ దర్ ఆరోపణలు చేశారు. 

loader