గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు

శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వ తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. ధునంజయ తండ్రి రంజన్ ని గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చగా.. ఆయన అక్కడిక్కడే ప్రాణాలు 
కోల్పోయారు. 

దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది.

రంజాన్.. స్థానిక రాజకీయవేత్త. దీంతో.. రాజకీయ శత్రువులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారేమో అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మరణంతో ధనుంజయ వెస్టిండీస్‌ వెళ్లే లంక జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

అతని స్థానంలో ఎవర్ని వెస్టిండీస్‌ పర్యటనకు పంపిస్తున్నారో వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే ఈ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. జూన్‌ 6 నుంచి శ్రీలంక-వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది.