క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్

Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.  క్రీడారంగానికి గతేడాదితో పోల్చితే కేటాయింపులను  పెంచారు. ఈ ఏడాది ఆసియా క్రీడలు ఉండటంతో  కేటాయింపులు భారీగా పెరిగాయి. 

Sports Sector Gets Huge Boost, Finance Ministry Allocates Rs. 3397 Crores  MSV

దేశ క్రీడారంగానికి  నిర్మలమ్మ తన బడ్జెట్ లో శుభవార్త అందించారు. నేడు లోక్‌సభలో ఆమె ప్రవేశపెట్టిన  కేంద్ర బడ్జెట్ -2023 లో భాగంగా క్రీడా రంగానికి కేటాయింపులను భారీగా పెంచారు.  2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను క్రీడా బడ్జెట్ ను రూ. 3,397.32 కోట్లుగా  ప్రకటించారు. గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 334.72 కోట్ల కేటాయింపులు పెరిగాయి.  ఈ ఏడాది  ఆసియా  గేమ్స్ తో పాటు వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న  నేపథ్యంలో ఈ కేటాయింపులు   క్రీడాకారులకు   మేలుచేసేవే. కాగా, ఇప్పటివరకు  క్రీడారంగానికి ఇంత  బడ్జెట్ కేటాయించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 

2022-23 బడ్జెట్ లో క్రీడారంగానికి రూ.  3,062.60 కోట్లు  కేటాయింపులు చేశారు.   అయితే ఈ ఏడాది ఆసియా గేమ్స్ తో పాటు  వచ్చే ఏడాది  పారిస్  వేదికగా జరుగబోయే  ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్న క్రీడాకారులకు  సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి. 

బడ్జెట్ లో ఎవరెవరికి ఎంతెంత..? 

- ఖేలో ఇండియా కు : రూ. 1,045 కోట్లు 
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) : రూ. 785.52 కోట్లు
- నేషనల్  స్పోర్ట్స్ ఫెడరేషన్ : రూ. 325 కోట్లు
- నేషనల్ సర్వీస్ స్కీమ్ : రూ. 325 కోట్లు 
- నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ : రూ. 15 కోట్లు 

 

దేశంలో   క్రీడాభివృద్ధిలో భాగంగా  క్రీడాకారులకు జాతీయ క్యాంపుల నిర్వహణ, శిక్షణ, అధునాతన క్రీడా సామాగ్రి కొనుగోలు, మౌలిక వసతుల కల్పన వంటి  సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.  పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు  పెంచుకోవాలని చూస్తున్న భారత్.. ఆ దిశగా క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నది.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios