స్టార్ బ్యాట్‌మన్ శుబ్‌మన్ గిల్ ఫిబ్రవరి 14న ఇన్‌స్టాగ్రామ్‌లో తన సింగిల్ ఫొటో షేర్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో అతను ఆ ఫొటో దిగాడు. అయితే, గతంలో అదే రెస్టారెంట్‌లో సారా టెండూల్కర్ దిగిన ఫొటోతో ఈ ఫొటోకు పోలికలు కనిపించాయి. ఈ రెండు ఫొటోలు వారిద్దరూ కలిసి ఆ రెస్టారెంట్ వెళ్లినప్పుడే తీసుకుని ఉంటారని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అందుకే శుబ్‌మన్ గిల్ అడ్డంగా దొరికిపోయాడని కామెంట్ చేస్తున్నారు. 

న్యూఢిల్లీ: ఇండియా స్టార్ బ్యాట్‌మన్ శుబ్‌మన్ గిల్ క్రికెట్‌లో రికార్డులతోపాటు బయట డేటింగ్ పుకార్లతోనూ ఫ్యాన్స్ నాలుక మీదే ఉంటున్నాడు. సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వదంతులు చాలా కామన్ అయిపోయాయి. అలాంటి శుబ్‌మన్ గిల్ వాలెంటైన్స్ డే రోజే అంటే ఫిబ్రవరి 14వ తేదీనే ఓ పోస్టు పెట్టాడు. దీంతో ఫ్యాన్స్ దాన్ని శూలశోధన చేయడం ప్రారంభించారు. అంతేకాదు, శుబ్‌మన్ గిల్ అడ్డంగా దొరికిపోయావ్ అంటూ సారా టెండూల్కర్ గతంలో షేర్ చేసిన ఫొటోనూ జత చేసి పోస్టులు చేస్తున్నారు.

ఫిబ్రవరి 14నాడు శుబ్‌మన్ గిల్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో తన ఫొటోను షేర్ చేశాడు. బ్లూ, ఎల్లో కలర్ ప్యాచ్ టీషర్ట్ వేసుకుని కాఫీ సిప్ చేస్తూ పోజు ఇచ్చిన ఫొటోను అతను పోస్టు చేశాడు. క్యాప్షన్‌గా ఇది మళ్లీ ఏ రోజు? అంటూ సరదా క్యాప్షన్ పెట్టాడు. చాలా మంది ఫ్యాన్స్ అతనికి హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ కామెంట్ చేశారు. కానీ, కొందరు అంతటితో సంతృప్తి చెందలేదు. అతను కాఫీ సిప్ చేస్తున్న రెస్టారెంట్‌ పై ఫోకస్ పెట్టారు. ఈ రెస్టారెంట్ సారా టెండూల్కర్ గతంలో పోస్టు చేసిన పిక్‌లోనూ ఉన్నదనే లింక్‌ను పట్టుకున్నారు.

View post on Instagram

సారా టెండూల్కర్ 2021 జులైలో ఓ ఫొటో పోస్టు చేసింది. అందులో అదే రెస్టారెంట్‌లో సారా టెండూల్కర్ కూర్చుని ఉన్నది. హే సిరి నా ఫుడ్ ఎక్కడా? అంటూ క్యాప్షన్ పెట్టింది. శుబ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ ఫొటోలు ఒకే రెస్టారెంట్‌లో దిగినవి కావడమే కాదు.. ఫొటోలోని వస్తువులను, ఇతర కస్టమర్లను పరిశీలిస్తే.. ఆ ఫొటోలు ఒకే సమయంలో దిగినట్టుగా స్పష్టం అవుతున్నది. దీంతో ఫ్యాన్స్ డేటింగ్ పుకార్లను మరోసారి ముందుకు తెచ్చారు. అడ్డంగా దొరికిపోయావ్ అంటూ కొందరు పోస్టులు పెట్టగా.. ఇప్పటికైనా ఒప్పుకో.. అని, ఇకనైనా ప్రకటించేసెయ్ అని మరికొందరు పోస్టులు పెట్టారు. కాగా, కొందరైతే ఫన్నీ మీమ్స్‌ను కూడా ఈ రెండు ఫొటోలను జత చేసి వదిలారు. మొత్తానికి వాలెంటైన్స్ డే రోజున సింగిల్ ఫొటో పోస్టు చేసి కూడా డేటింగ్ పుకార్లను శుబ్‌మన్ గిల్ ఆపలేకపోయాడు.

View post on Instagram

ఈ రెస్టారెంట్ ఇటాలియన్ క్యూసిన్ సర్వ్ చేస్తుంది. ఇది లండన్‌లోనిది. ఇక్కడే సారా టెండూల్కర్ తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సారా తీసుకున్న ఫొటో కాలంలో భారత టీమ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నది.

Scroll to load tweet…

ఈ నేపథ్యంలోనే ఈ రెండు ఫొటోలను వారిద్దరూ కలిసి ఆ రెస్టారెంట్ వెళ్లినప్పుడే తీసుకుని ఉంటారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.