Asianet News TeluguAsianet News Telugu

అచ్రేకర్ అంత్యక్రియలు: ప్రభుత్వంపై శివసేన ఫైర్, సచిన్‌కు సలహా

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా ఎందరో క్రికెటర్లను భారతదేశానికి అందించిన క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ అంత్యక్రియలు గురువారం ముంబైలో ముగిశాయి. అయితే పద్మభూషణ్‌తో పాటు ద్రోణాచార్య అవార్డు అందుకున్న వ్యక్తి అంత్యక్రియలు సాధారణ వ్యక్తికి జరిగినట్లు జరగడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Shivsena fires over no state funeral for Ramakant Acharekar
Author
Mumbai, First Published Jan 4, 2019, 1:09 PM IST

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా ఎందరో క్రికెటర్లను భారతదేశానికి అందించిన క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ అంత్యక్రియలు గురువారం ముంబైలో ముగిశాయి. అయితే పద్మభూషణ్‌తో పాటు ద్రోణాచార్య అవార్డు అందుకున్న వ్యక్తి అంత్యక్రియలు సాధారణ వ్యక్తికి జరిగినట్లు జరగడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

అచ్రేకర్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అవమానించిందంటూ శివసేన ఎంపీ సంజయ్ రావత్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా గురువును అవమానించినందుకు నిరసనగా ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరించాలంటూ సచిన్ టెండూల్కర్‌కు ఆయన సూచించారు.

ఈ అంశంపై మహారాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా స్పందించారు. రమాకాంత్ అచ్రేకర్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపకపోవడం వెనుక వేరే దురుద్దేశం లేదని, కేవలం సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రభుత్వం గొప్ప ఆచార్యుడి పట్ల తన బాధ్యతను నెరవేర్చకపోగా.. సమాచారలోపం కారణంగా ప్రభుత్వ లాంఛనాలతో అచ్రేకర్ అంత్యక్రియలు నిర్వహించలేపోయామని చెప్పడం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని శివసేన తన ఆస్థాన పత్రిక ‘‘సామ్నా’’లో వ్యాసాన్ని ప్రచురించింది.

మరోవైపు తను ఈ స్థాయికి రావడానికి ఎంతగానో ప్రొత్సహించిన గురువు గారి మరణంతో సచిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన సహచరుడు వినోద్ కాంబ్లీతో కలిసి రమాకాంత్ అంత్యక్రియలకు హాజరైన సచిన్....తన కోచ్ భౌతిక కాయాన్ని ఉంచిన పాడెను మోశారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టారు.

సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

Follow Us:
Download App:
  • android
  • ios