భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొందని ఓపెనర్ ధావన్ అభిప్రాయపడ్డారు. జట్టులోకి కొత్తగా వస్తున్న యువ ఆటగాళ్లు అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుంటున్నారని... దీంతో ఈ ప్రభావం సీనియర్ ఆటగాళ్లపై పడుతోందన్నారు. యువ క్రికెటర్లు జట్టులో సుస్థిర స్థానాన్ని ఆక్రమించడం వల్ల సీనియర్ ఆటగాళ్ళపై వేటు తప్పడంలేదని ధావన్ అభిప్రాయయపడ్డారు. 

ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రమైందని...చివరి జట్టులో స్థానం కోసం కాదు... 15 మంది ఆటగాళ్లలో ఎంపికైనా చాలనుకునే అభిప్రాయం ఆటగాళ్ళలో వుందని ధావన్ తెలిపారు. 

మౌంట్‌ మాంగనూయ్‌ లో రేపు( 26న) రెండో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ...భారత జట్టే కాదు...రిజర్వ్ బెంచ్ కూడా బలంగా వుందన్నారు. జట్టులోకి వచ్చేముందే యువ క్రికెటర్లు తమ ఆటతీరులో మంచి పరిణతి సాధిస్తున్నారు. దీంతో వారికి అవకాశాలు పెరిగి సీనియర్లపై వేటు పడుతోందని ధావన్ వెల్లడించారు. 

పృథ్వీషా, రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ వంటి యువకులు చక్కటి ఆటతీరుతో జట్టులోకి చేరడమే కాదు...తమ స్థానాలను సుస్థిరం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆటకు ముందు వెల్లడించే తుది జట్టు  కోసం కాదు...సీరిస్ కు ముందు ప్రకటించే 15మందిలో కూడా చోటు దక్కించుకోడానికి తీవ్రమైన పోటీ నెలకొందన్నారు.  సీనియర్లతో పోటీ పడుతూ వీరు  ముందుకు సాగుతున్నట్లు ధావన్ వెల్లడించారు.