Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: నువ్వు భారతదేశానికే గర్వకారణం.. పీవీ సింధూకి రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజకీయ, క్రీడా తదితర రంగాలకు చెందిన  ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

She is Indias pride PM Narendra Modi leads wishes as PV Sindhu clinches bronze medal in Tokyo Olympics ksp
Author
New Delhi, First Published Aug 1, 2021, 6:47 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజకీయ, క్రీడా తదితర రంగాలకు చెందిన  ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

పీవీ సింధు రెండు ఒలింపిక్ క్రీడలలో పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అని రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ఆమె స్థిరత్వం, అంకితభావంతో కొత్త మైలురాళ్లను నెలకొల్పారని ఆయన అన్నారు. తన ప్రతిభతో భారతదేశానికి కీర్తి తెచ్చినందుకు పీవీ సింధుకి నా హృదయపూర్వక అభినందనలు అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

 

 

టోక్యో ఒలింపిక్స్‌లలో కాంస్య పతకం సాధించినందుకు పీవీ సింధుకి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. ఆమె భారతదేశానికే గర్వకారణమని, దేశ అత్యుత్తమ ఒలింపియన్లలో సింధు ఒకరని ప్రధాని ప్రశంసించారు.

 

 

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, కాంస్య పతక పోరులో విజయం సాధించింది. పీవీ సింధు గెలిచిన కాంస్యంతో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 2కి చేరింది. కాంస్యపతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివో‌తో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు, భారత్‌కి పతకాన్ని అందించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios