45 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ హర్షదా శరద్... ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర...
గ్రీసులోని హెరాక్లియన్‌లో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్ లిఫ్టర్ హర్షదా శరద్ గరుడ్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. వుమెన్స్ 45 కేజీల కేటగిరిలో పోటీపడిన హర్షదా శరద్, తొలి ప్రయత్నంలో 70 కిలోలు, రెండో రౌండ్‌లో 83 కేజీలు లిఫ్ట్ చేసింది. మొత్తంగా 153 కిలోలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన హర్షదా శరద్, క్లీన్ అండ్ జెర్క్ సెక్షన్‌లో సెకండ్ బెస్ట్‌గా నిలిచినా స్నాచ్ రౌండ్‌లో ఆమె సాధించిన పాయింట్లు, స్వర్ణం సాధించేందుకు సహాయ పడ్డాయి...
టర్నీకి చెందిన బెకత్సాస్ కన్సు స్నాచ్ రౌండ్‌లో 65 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 85 కిలోలు ఎత్తి మొత్తంగా 150 కిలోలతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది...
మల్దోవాకి చెందిన హింకు టోడోరా లుమినితా స్నాచ్ రౌండ్‌లో 67 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 82 కిలోలు ఎత్తి నాన్ ఒలింపిక్ కేటగిరిలో 149 కిలోలతో మూడో స్థానంలో నిలి... కాంస్య పతకం అందుకుంది...
ఇదే విభాగంలో భారత్ తరుపున పోటీపడిన వెయిట్ లిఫ్టర్ అంజలి పటేల్ స్నాచ్ రౌండ్‌లో 67 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 81 కిలోలు ఎత్తి మొత్తంగా 148 కిలోలతో ఐదో స్థానంలో నిలిచింది...
ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది హర్షదా శరత్. ఇంతకుముందు 2013లో టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాభాయి ఛాను... వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించగా గత ఏడాది అచింతా షెరూలీ కూడా కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పటిదాకా ఈ ఇద్దరే ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన భారత మహిళలుగా ఉన్నారు.
