క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో బాధపడుతున్న సమయంలో అతడిని కాపాడేందుకు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు 20 నిమిషాల పాటు CPR చేశారు. అయినప్పటికీ అతడు ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. 

ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్(Shane Warne) గుండెపోటుతో మ‌రణించ‌డం య‌వాత్తు క్రీడా ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఆయ‌న మృతి ప‌ట్ల క్రీడాకారులు తీవ్ర ద్రిగ్భాంతిని వ్య‌క్తం చేశారు. క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. 52 ఏళ్ల ఆట‌గాడు ఇలా అర్ధాంత‌రంగా చనిపోవ‌డం ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 

అయితే షేన్ వార్న్ కు ఆక‌స్మాత్తుగా గుండె పోటు వ‌చ్చిన సమ‌యంలో అత‌డిని కాపాడేందుకు ఆయ‌న స్నేహితులు తీవ్రంగా శ్ర‌మించారు. 20 నిమిషాల పాటు షేన్ వార్న్ ప్రాణాల‌ను ర‌క్షించేందుకు చాలా ప్ర‌య‌త్నించార‌ని, అయినా ఆయ‌న మృతి చెందార‌ని థాయ్ పోలీసులు తెలిపారు.

వార్న్, మరో ముగ్గురు స్నేహితులు క‌లిసి కో స్యామ్యూయ్ (Koh Samui) లోని ఒక ప్రైవేట్ విల్లాలో ఉంటున్నారు. అయితే ఆయ‌న డిన్నర్‌కు రాకపోవడంతో స్నేహితుల్లో ఒక‌రు వార్న్ గురించి ఆరా తీశారు. గ‌దికి వెళ్లి చూస్తే తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆయ‌న బాధ‌పడుతూ క‌నిపించారు. దీంతో ఓ స్నేహితుడు అతడిపై CPR చేసారు. అనంత‌రం అత‌డు అంబులెన్స్‌కు కాల్ చేశార‌ని బో పుట్ పోలీసు అధికారి చట్చావిన్ నక్ముసిక్ (Chatchawin Nakmusik) రాయిట‌ర్స్ కు తెలిపారు. ‘‘ఆ స‌మ‌యంలో ఎమెర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ (mergency response unit) అక్క‌డికి చేరుకొని 10-20 నిమిషాల పాటు మ‌రో సారి CPR చేసింది. తర్వాత థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ వచ్చి అతన్ని అక్కడికి తీసుకువెళ్లింది. వారు ఐదు నిమిషాల పాటు CPR చేసారు. త‌రువాత అతను మరణించాడు.’’ అని చట్చావిన్ నక్ముసిక్ అని తెలిపారు. అయితే మరణానికి కారణం తెలియదని కానీ దానిని అనుమానాస్పదంగా పరిగణించలేదని ఆయ‌న చెప్పారు. 

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ (Marise Payne), అధికారులు థాయ్‌లాండ్‌లోని వార్న్ స్నేహితులతో మాట్లాడారు. త‌రువాతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు వారికి స‌హాయం చేసేందుకు శనివారం కో స్యామ్యూయ్‌కు వెళ్ల‌నున్నారు. ‘‘ షేన్ వార్న్ మరణించిన తరువాత మిగిలిన ఏర్పాట్లను నిర్వహించేందుకు, అతడిని స్వదేశానికి పంపించేందుకు, గ్రౌండ్ లో వివిధ సహాయాన్ని అందించేందుకు థాయ్ అధికారులతో కలిసి పని చేస్తున్నాము ’’ అని మారిస్ పేన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

షేన్ వార్నర్ 1983-84 మధ్య కాలంలో అండర్-16 విభాగంలో యునివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. మెరుగైన ఆట‌తీరుతో అండర్‌-19లోకి అడుగుపెట్టి త‌న స‌త్తా చాటుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. త‌న స్పిన్​ మాయాజలంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అందరి దృష్టి వార్న్ పై పడింది. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వె​య్యి వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షేన్‌ వార్న్‌. త‌న కెరీర్ లో 145 టెస్టులాడి 708 వికెట్లు, 194 వన్డే ఆడి 293 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లోనే వార్న్‌ టెస్టుల్లో 3154 పరుగులు సాధించాడు. త‌న స్పిన్ మ్యాజిక్ తో టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల హాల్‌.. 10 సార్లు 10 వికెట్ల తీసిన అదురైన ఘనత సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. అంతేకాదు టెస్టుల్లో 700 వికెట్ల మార్క్‌ అందుకున్న తొలి బౌలర్‌ కూడా వార్నరే..సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్య‌ధికంగా 71 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు షేన్ వార్న్.