Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన భారత బౌలర్...10 ఓవర్లు,10 పరుగులు, 8 వికెట్లు

విజయ్ హజారే ట్రోపీలో జార్ఖండ్ స్పిన్ బౌలర్ షాబాజ్ నదీమ్ అద్భుతం సృష్టించాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కోలుకోలేకుండా చేయడమే కాకుండా తన క్రికెట్ కేరీర్ లోనే అత్యత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఇలా అద్భుత బౌలింగ్ తో  20 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును అతి సునాయాసంగా బ్రేక్ చేశాడు. 

Shahbaz Nadeem breaks List A bowling world record
Author
Jharkhand, First Published Sep 20, 2018, 4:08 PM IST

విజయ్ హజారే ట్రోపీలో జార్ఖండ్ స్పిన్ బౌలర్ షాబాజ్ నదీమ్ అద్భుతం సృష్టించాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కోలుకోలేకుండా చేయడమే కాకుండా తన క్రికెట్ కేరీర్ లోనే అత్యత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఇలా అద్భుత బౌలింగ్ తో  20 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును అతి సునాయాసంగా బ్రేక్ చేశాడు. 

లిస్ట్ ఎ క్రికెట్ జట్ల మధ్య విజయ్ హజారే ట్రోఫి జరుగుతున్న విషయం తెలసిందే. ఈ ట్రోపీలో భాగంగా జార్ఖండ్, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో  జార్ఖండ్ బౌలర్ షాబాజ్ నదీమ్ ప్రత్యర్థి జట్టును తన స్పిన్ బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్ లో అతడు 10 ఓవర్లేసి కేవలం 10 పరుగులే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో షాబాజ్ హ్యాట్రిక్ సాధించడంతో పాటు నాలుగు ఓవర్లు మెడిన్లు వేయడం విశేషం. ఇలా నదీమ్ అత్యుత్తమ బౌలింగ్ తో తన లిస్ట్ ఎ కేరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకోవడంతో పాటు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

షాబాజ్ బౌలింగ్ దాటికి తట్టుకోలేక రాజస్థాన్ జట్టు కేవలం 28.3 ఓవర్లలోనే 73 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన జార్ఖండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  
 
Follow Us:
Download App:
  • android
  • ios